సలార్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ప్రభాస్ మూవీ ఎప్పటి నుండి సెట్స్‌పైకి వెళ్లనుందంటే..!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు దారుణమైన పరాజయాలు చెందగా ఆ తర్వాత వచ్చిన సలార్ చిత్రం ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందించింది. ఈ మూవీ ప్రేక్షకుల దాహం తీర్చింది అని చెప్పొచ్చు.పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా, ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైంది. కేవలం తెలుగుతో పాటు హిందీలోను ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సుమారు రూ.750కోట్ల వసూళ్లతో సత్తాచాటగా, ఈ మూవీ క్లైమాక్స్‌లో దర్శకుడు అనేక ప్రశ్నలు మిగిల్చారు. దీనిపై సలార్ పార్ట్2పై అందరిలో ఆసక్తి నెలకొంది.
సలార్ పార్ట్ 2 చిత్రానికి ‘శౌర్యాంగ పర్వం’ అని టైటిల్‍ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేయగా, ఇందులో ప్రాణ స్నేహితులైన దేవ( ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య యుద్ధం ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులలో మూవీపై చాలా ఆసక్తి నెలకొంది..అయితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే సందేహాలకి రీసెంట్‌గా నటుడు బాబి సింహ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన సలార్ 2 ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. దీనికోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలియజేశాడు.
బాబీ సింహా చెప్పిన వార్తతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలలో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కనిపించి సందడి చేశారు. సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ ఏప్రిల్‍లో మొదలైనప్పటికీ ప్రభాస్ మాత్రం కొన్ని రోజుల తర్వాతే టీంతో జాయిన్ కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం డార్లింగ్ కల్కి చిత్రంతో పాటు రాజా సాబ్ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఇవి పూర్తి చేసి తన కాల్షీట్స్ మొత్తం సలార్ 2కి కేటాయించనున్నాడని అంటున్నారు