Prabhas | ప్ర‌భాస్ ఎదుగుద‌ల‌పై భారీ కుట్ర పన్నారా .. వాడిని ఆప‌క‌పోతే…

Prabhas |ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా స్టార్ అన్న మాట సహజంగా వినిపిస్తుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోల సరసన మార్కెట్ పరంగా నిలబడగలిగే స్థాయికి ప్రభాస్ ఎదిగాడు. ఈ మార్పుకు ప్రధాన కారణం ‘బాహుబలి’. ఆ సినిమా ముందు వరకు టాలీవుడ్‌లో ఒక స్టార్‌గా గుర్తింపు ఉన్న ప్రభాస్, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నెంబర్ వన్ హీరోల లిస్ట్‌లోకి చేరిపోయాడు.

  • By: sn |    movies |    Published on : Jan 29, 2026 11:20 AM IST
Prabhas | ప్ర‌భాస్ ఎదుగుద‌ల‌పై భారీ కుట్ర పన్నారా .. వాడిని ఆప‌క‌పోతే…

Prabhas |ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా స్టార్ అన్న మాట సహజంగా వినిపిస్తుంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోల సరసన మార్కెట్ పరంగా నిలబడగలిగే స్థాయికి ప్రభాస్ ఎదిగాడు. ఈ మార్పుకు ప్రధాన కారణం ‘బాహుబలి’. ఆ సినిమా ముందు వరకు టాలీవుడ్‌లో ఒక స్టార్‌గా గుర్తింపు ఉన్న ప్రభాస్, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నెంబర్ వన్ హీరోల లిస్ట్‌లోకి చేరిపోయాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కార‌ణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కారణం – ఇటీవల విడుదలైన ‘ది రాజాసాబ్’ సినిమాపై జరిగిన నెగటివ్ ప్రచారం. సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో డిజాస్టర్ అంటూ ట్రోలింగ్ మొదలవడం అభిమానులను కలిచివేసింది.

నిజానికి ‘ది రాజాసాబ్’ కథ, ట్రీట్‌మెంట్ విషయంలో లోపాలు ఉన్నాయని చాలామంది విమర్శించారు. దర్శకుడు మారుతి కొత్త తరహా పాయింట్‌తో ప్రయత్నించినా, ప్రభాస్ స్టార్ ఇమేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడన్న అభిప్రాయం వినిపించింది. కానీ అదే సమయంలో, ఓ స్టార్ హీరో కొత్త జానర్‌లో చేసిన ప్రయోగానికి కనీస గౌరవం ఇవ్వలేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే “ప్రభాస్ ఎదుగుదలని కొందరు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా?” అనే వాదన మరోసారి వినిపిస్తోంది.

ఇది కొత్త చర్చ కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ‘ఛత్రపతి’ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత ఓ ప్రముఖ మ్యాగజైన్‌లో వచ్చిన కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆ కథనంలో ప్రభాస్ లుక్స్, ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని, నటనలో మరింత మెరుగుపడితే అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని రాసింది. అంతేకాదు, అతని ఎదుగుదలను అడ్డుకునేందుకు కొంతమంది పెద్ద హీరోలు అంతర్గతంగా చర్చలు చేసినట్లు కూడా అందులో పేర్కొనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో తిరిగి చర్చకు వస్తోంది.

ఇదిలా ఉండగా, ‘ది రాజాసాబ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈసారి ఓటీటీ రూపంలో. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సుమారు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారం లేదా చివరి వారం నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.ఫాంటసీ, హారర్, కామెడీ ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని తమన్ అందించాడు.

సినిమా చివర్లో సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తర్వాత ‘ది రాజాసాబ్’పై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా మారుతుందో, ప్రభాస్ ప్రయోగానికి కొత్త గుర్తింపు వస్తుందో చూడాల్సి ఉంది.