సెన్సేష‌న్ సృష్టించిన హ‌నుమాన్.. ఇందులో న‌టించిన న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

  • By: sn    breaking    Jan 15, 2024 12:11 PM IST
సెన్సేష‌న్ సృష్టించిన హ‌నుమాన్.. ఇందులో న‌టించిన న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి పోటీగా మూడు సినిమాలు విడుదలైన‌ప్ప‌టికీ ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. హనుమాన్ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ హిందీలో 12 కోట్ల నెట్, తెలుగు, ఇతర భాషల్లో 42 కోట్లు, 50 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో రాబట్టిన 12 కోట్లతో కలిపి ఓవరాల్‌లో ఈ సినిమా 66 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

హనుమాన్ మూవీ కోసం చిత్ర బృందం చాలా క‌ష్ట‌ప‌డింది. ఇక ఈ మూవీ రిలీజ్ విష‌యంలో అనేక అడ్డంకులు ఎదురైన ఎట్ట‌కేల‌కి సంక్రాంతి బ‌రిలో నిలిచింది. పురాణాలు ఇతిహాసాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించారు. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. మొత్తం రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.21 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ మూవీ రూ.12.45 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమా కోసం న‌టీన‌టులు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జా.. ఈ చిత్రానికి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ అమృతా అయ్యార్ రూ. 1.5 కోట్ల పారితోషికం , అలానే అంజమ్మ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకు రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లుగా స‌మాచారం. అలాగే వినయ్ రాయ్ ఈ చిత్రానికి రూ.65 లక్షల పారితోషికం తీసుకున్నాడ‌ని , కమెడియన్ వెన్నెల కిషోర్ రూ. 55 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త‌క్కువ బ‌డ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని రూపొందించ‌గా, ఇప్పుడు ఈ సినిమాకి కాసుల వ‌ర్షం కురుస్తుండ‌డంతో నిర్మాత‌లు ఫుల్ ఖుష్ అవుతున్నారు.