Shruti Marathe | దేవర టీమ్‌కు షాక్‌ ఇచ్చిన మరాఠీ బ్యూటీ శృతి మరాఠే..! ఇంతకి ఏం చేసిందంటే..?

Shruti Marathe | దేవర టీమ్‌కు షాక్‌ ఇచ్చిన మరాఠీ బ్యూటీ శృతి మరాఠే..! ఇంతకి ఏం చేసిందంటే..?

Shruti Marathe | టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. అయితే, ఈ చిత్రాన్ని లీకులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ లుక్‌కి సంబంధించిన పిక్స్‌ విడుదలయ్యాయి. తాజాగా సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. స్వయంగా హీరోయిన్‌ తన పాత్రను బయటపెట్టింది. దాంతో చిత్ర యూనిట్‌ తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాల్లో కొరటాల శివ తెరక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నది. మరో హీరోయిన్‌గా మరాఠీ బ్యూటీ శృతి మరాఠేను తీసుకున్నారు.

ఇక తొలి భాగం ఈ ఏడాది అక్టోబర్‌ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతున్నది. చిత్రాన్ని లీకులు వెంటాడుతున్నాయి. ఇటీవల గోవాలో షూటింగ్‌ జరిగింది. ఎన్టీఆర్‌-జాన్వీపై సాంగ్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించారు. గోవాలోని సముద్రం వద్ద షూటింగ్‌ జరుగుతుండగా.. ఎన్టీఆర్‌ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్‌ అయ్యింది. దూరంగా చెట్టుమీద నుంచి ఎవరో వ్యక్తి సీన్స్‌ను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత చిత్రబృందం ఎన్టీఆర్‌ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేసింది. తాజాగా సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ శృతి మరాఠే స్వయంగా తన పాత్ర గురించి రివీల్‌ చేసింది. దేవర సినిమాలో నటిస్తున్నానని.. అక్టోబర్‌ 10న విడుదలవుతుందని తెలిపారు. చిత్రంలో తాను దేవర భార్యగా కనిపిస్తానని.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

దాంతో చిత్రబృందం షాక్‌కు గురైంది.శృతి పాత్రను స్వయంగా బయటకు వెల్లడించడంతో యూనిట్‌ అంతా షాక్‌కు గురైంది. మూవీలో జాన్వీ కపూర్‌ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనున్నది. రెండో హీరోయిన్‌గా శృతి మరాఠాను తీసుకున్నారు. అయితే, దేవరలో ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తున్నది. ఎన్టీఆర్‌ డ్యుయెల్‌ రోల్‌లో తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారని.. తండ్రి పాత్రకు శృతి మరాఠే జోడీగా.. కొడుకుగా వచ్చే పాత్రకు జాన్వీ కపూర్‌ జోడీగా నటించనున్నట్లు తేలింది. వాస్తవానికి శృతి పాత్రను మేకర్స్‌ రహస్యంగానే ఉంచాలని భావించారు. ఇప్పటికే లీకులు వెంటాడుతుండగా.. తాజాగా హీరోయిన్‌ పాత్రను రివీల్‌ చేయడడంతో మేకర్స్‌ తలలుపట్టుకుంటున్నారు.