ICC T20I Rankings | మూడునెలలు క్రికెట్‌కు దూరమైనా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా సూర్యకుమార్‌..

ICC T20I Rankings | మూడునెలలు క్రికెట్‌కు దూరమైనా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌గా సూర్యకుమార్‌..

ICC T20I Rankings | తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతున్నది. మూడు నెలలుగా పొట్టి క్రికెట్‌కు దూరమైనా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌కు చెందిన వెటరన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్‌-10లోకి మళ్లీ ఎంటీ ఇచ్చాడు. నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకొని.. తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.

గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టులో భాగమైన సూర్యకుమార్ యాదవ్ మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పటి నుంచి మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లోకి తిరిగి మైదానంలోకి వస్తాడని భావిస్తున్నారు. ముంబయి ఇండియన్స్‌ జట్టులో కీలకమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్ 802 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాక్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ మూడోస్థానంలో ఉన్నాడు. భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌ ఆరో స్థానానికి చేరుకున్నాడు.

అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ మరోసారి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. గాయం నుంచి తిరిగి వచ్చి ఐర్లాండ్‌పై ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మెరుగైన ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ సైతం ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. రెండు స్థానాలు ఎగబాకి 55వ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్‌ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక ఆటగాడు హసరంగ రెండోస్థానంలో, బంగ్లా ఆటగాడు మహ్మద్‌ నబీ మూడోస్థానంలో ఉన్నాడు.