‘ఆమె నా భార్య’.. క్లారిటీ ఇచ్చిన క్రికెటర్

అప్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. రషీద్ ఖాన్ రెండో పెళ్లిపై కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి.

‘ఆమె నా భార్య’.. క్లారిటీ ఇచ్చిన క్రికెటర్

అప్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. రషీద్ ఖాన్ రెండో పెళ్లిపై కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. మహిళతో అతను దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ వివరణ ఇచ్చారు.

‘అగస్టు 2, 2025న నా జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం అయింది. అవును నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆమే నా జీవిత భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల నా భార్యను ఛారిటీ కార్యక్రమానికి తీసుకెళ్లాను. ఇంత చిన్న విషయంపై పలు ఊహాగానాలు రావడం దురదృష్టకరం. ఆమె నా భార్య.. ఇందులో దాచడానికి ఏమీ లేదు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని రషీద్ ఖాన్ వెల్లడించారు.

కాగా, రషీద్ ఖాన్ కు 2024లో మొదటి వివాహం జరిగింది. ఈ పెళ్లికి అఫ్ఘన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ, సంవత్సరం గడవక ముందే వారిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. రషీద్ ఖాన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.