IRCTC Tour | వేసవిలో అరకు టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా..? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ మీ కోసమే..!

IRCTC Tour | ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ బంపర్ ప్యాకేజీని ప్రకటించింది. టన్నెల్స్, వంతెనలపై ప్రయాణం పర్యాటకులకు అనుభూతి కలిగిస్తుంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణం మరిచి పోలేని అనుభూతినిస్తుంది. ఈ ప్యాకేజీలోని మూడు రోజులపాటు అరకు అందాలను వీక్షించేందుకు ఐఆర్‌సీటీసీ పర్యాటకులకు అవకాశం కల్పిస్తున్నది. ‘వైజాగ్-అరకు హాలీడే ప్యాకేజ్’ను తీసుకువచ్చింది. ఇందులో మూడురోజుల పాటు వివిధ ప్రాంతాలను చుట్టిరావొచ్చు. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ అందుబాటులో ఉంచింది. ప్రతిరోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
ప్యాకేజీలో పర్యటన ఇలా..
వైజాగ్-అరకు హాలీడే ప్యాకేజీ రెండు రాత్రులు, మూడురోజుల పాటు కొనసాగుతుంది. తొలిరోజు పర్యటన విశాఖపట్నం నుంచి మొదలవుతుంది. నగరంలోని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ సందర్శనకు వెళ్తారు. అదే రోజు రాత్రి వైజాగ్ వైజాగ్‌లోనే బస ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖ నుంచి అరకుకు బయలుదేరుతారు. తైడ జెంగిల్ బెల్స్, అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు సందర్శిస్తారు. రాత్రి విశాఖపట్నం చేరుకొని అక్కడే బస చేస్తారు. మూడోరోజు సబ్ మెరైన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. దాంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ పర్యటన ఇలా..
ప్యాకేజీలో వేర్వేరుగా ధరలను నిర్ణయించింది. కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.17,715 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,100.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7,980గా నిర్ణయించింది. వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది. టికెట్ల కోసం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది.