Vijay Devarakonda | విజయ్ దేవరకొండ,రష్మిక పెళ్లి వార్తలు.. వీటి మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రౌడీ బాయ్
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలవడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఈ సమావేశం వెనుక అసలు కారణం ఏంటన్నదానిపై చర్చలు మొదలయ్యాయి.
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలవడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఈ సమావేశం వెనుక అసలు కారణం ఏంటన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. గత కొన్నిరోజులుగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని, గత ఏడాదే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించకపోయినా, వార్తలు మాత్రం ఆగడం లేదు.
సమాచారం ప్రకారం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్లో ఈ జంట వివాహ వేడుక జరగనుందట. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే గోప్యంగా ప్రారంభమయ్యాయని, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన వివాహానికి ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కలిసినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ భేటీలో విజయ్ తన జీవితంలో జరిగే ఈ ప్రత్యేక సందర్భానికి తప్పకుండా హాజరుకావాలని సీఎంను కోరినట్టు సమాచారం. దీనికి సీఎం కూడా పాజిటివ్‌గా స్పందించి, కాబోయే జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. కలిసి సినిమాలు చేయడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో ఒకరినొకరు సపోర్ట్ చేయడం వల్ల వీరి రిలేషన్‌పై అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. ఇప్పుడు పెళ్లి వార్తలు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది.
అయితే ఇది నిజంగానే పెళ్లి ఆహ్వాన భేటీనా? లేక మరే ఇతర కారణమా? అన్నదానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం విజయ్ – రష్మిక వివాహం వార్తలతో సోషల్ మీడియా మొత్తం సందడిగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram