బతికుండగానే ఇమ్మాన్యుయేల్‌ని చంపేసారు.. నవ్వుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడుగా..!

ఇటీవలి కాలంలో బతికున్నవాళ్లని చంపడం మనం కామన్‌గా చూస్తున్నాం.సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి మంచితో పాటు చెడు కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బతికుండగానే చంపేస్తుండడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా జబర్ధస్త్ షోతో మంచి పేరు సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేశాయి.ఈ విషయం తెలుసుకున్న ఇమ్మాన్యుయేల్ ఫల్ ఫైర్ అయ్యాడు. నవ్వుకుంటూనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెబ్ సిరీస్ లలో, టీవీ షోలలో నటిస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై స్పేస్ పెంచుకుంటూ వస్తోన్న ఇమ్మాన్యూయల్ చనిపోయారు అంటూ.. ఓ య్యూట్యూబ్ థంబ్ నెయిల్ వైరల్ అయ్యింది. అంతే కాదు పక్కన వర్ష ఏడుస్తూ కూర్చున్న ఫోటోని కూడా థంబ్ నెయిల్‌లో పెట్టారు. ఇది చూసి అభిమానులు కంగారు పడ్డారు. సడెన్‌గా ఆయన చనిపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అసలు ఇమ్మాన్యుయేల్ చనిపోవడంకి సంబంధించి వార్తలు రావడం వెనక కారణాలు ఏంటంటే..ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు నటించాడు. దీంతో ఆ ఫోటోలను తీసుకొని ఇమ్మాన్యుయేల్ మరణించాడని పలు యూట్యూబ్ చానళ్ళు ఫేక్ వీడియోలు పెట్టడంతో ఈ విషయం ఇమ్మాన్యుయేల్ వరకు చేరింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు వార్తలపై తాజాగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ప్రచారం చేసేవారిని ఏమనాలో అర్దం కావడంలేదని అన్న ఇమ్మాన్యుయేల్.. తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానని.. అయితే ప్రేమ వాలంటీర్ అనే సిరీస్ లో క్లైమాక్స్ లో తను చనిపోయినట్టు చూపించారని, దానిని పట్టుకొని నిజంగానే నన్ను చంపేశారు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్మాన్యుయేల్. అసలు మనిషి బ్రతికి ఉండగానే చనిపోయాడంటూ ఎలా ప్రచారం చేస్తారు.. ఇలా చేస్తే వారు ఎంత బాధపడుతారు..వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది కదా..మరి ఫ్యామిలీలో ఎంత కంగారు పడతారు.. మీ ఇంట్లోనే ఇలాంటిది జరిగితే మీకు ఎలా ఉంటుంది.. వ్యూస్ కోసం..రేటింగ్స్ కోసం ఇలాంటి అర్థంలేని వార్తలను ప్రచారం చేయడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.