Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake | టోక్యో : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీరంలోని ఇజు ద్వీపకల్పంలోని దీవులకు సునామీ హెచ్చరికలను జపాన్ వాతావరణ శాఖ జారీ చేసింది.
జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. టోరిషిమా ద్వీపానికి సమీపంలో ఉదయం 11 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపింది. టోక్యోకు దక్షిణంగా 550 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు స్పష్టం చేసింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
జపాన్‌లోని హిరారాలో రెండు వారాల క్రితం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తమ నివాసాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.