Spain | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
Spain | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ రైలు ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Spain | స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ రైలు ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై స్పెయిన్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
స్పెయిన్‌లోని మలగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హై స్పీడ్ రైలు.. అడమ్జ్ వద్ద పట్టాలు తప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న రైలు ఢీకొట్టడంతో అది కూడా పట్టాలు తప్పింది. రెండు రైళ్లు ఢీకొట్టడంతో అక్కడ భీతావహ వాతావరణం ఏర్పడింది. రైలు బోగీల మధ్య మృతదేహాలు చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనను స్పెయిన్ అడిఫ్ రైల్ నెట్ వర్క్ ఆపరేటర్ అధికారికంగా ధృవీకరిస్తూ ఎక్స్‌లో ప్రకటన చేసింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. 30 మంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు స్పెయిన్ రవాణా శాఖ మంత్రి చెప్పారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. 2013లో శాంటియాగో డీ కంపోస్టేలా పరిధిలో హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో.. 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి పైగా గాయపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram