Ana Obregon | షాకింగ్‌ న్యూస్‌.. కొడుకు వీర్యంతో బిడ్డను కన్న తల్లి..!

  • By: Thyagi |    trending |    Published on : Apr 12, 2024 10:54 PM IST
Ana Obregon | షాకింగ్‌ న్యూస్‌.. కొడుకు వీర్యంతో బిడ్డను కన్న తల్లి..!

Ana Obregon : ఓ మహిళ తాను కనిపెంచిన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నది. ఏదో ఒకరోజు తండ్రిని కావాలన్న ఉద్దేశంతో అతను ఓ స్పెర్మ్‌ సెంటర్‌లో భద్రపర్చి ఉంచిన వీర్యాన్ని వినియోగించి ఆమె సరోగసీ విధానం ద్వారా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాజాగా తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. అనా ఓబ్రెగాన్‌ (Ana Obregon) అనే మహిళ స్పెయిన్‌ దేశానికి చెందిన ఒకప్పటి సినీ నటి. ఇప్పుడామె వయస్సు 69 సంవత్సరాలు. గతంలో ఆమెకు అలెస్‌ లెక్వియో (Aless Lequio) అనే ఒక కొడుకు ఉండేవాడు. కొడుకును ఆమె అల్లారుముద్దుగా చూసుకునేది. అయితే విధిరాత ఆ తల్లీబిడ్డలను విడదీసింది. క్యాన్సర్‌ బారినపడి అలెస్‌ తన 27వ ఏట మరణించాడు.

అయితే మరణానికి ముందు అలెస్‌ ఏదోఒక రోజు తాను తండ్రిని కావాలని కలలు కనేవాడు. వయసు పెరిగితే వీర్యం కౌంట్‌ తగ్గుతుందేమోననే భయంతో ముందే తన వీర్యాన్ని ఓ స్పెర్మ్‌ సెంటర్‌లో భద్రపర్చాడు. కానీ తానొకటి తలిస్తే విధి మరోటి తలిచింది. తర్వాత అతడు క్యాన్సర్‌ బారినపడి కొన్నాళ్లకు మరణించాడు.

అయితే ఏదో ఒకరోజు తండ్రి కావాలనే ఆశతో అలెస్‌ తన వీర్యాన్ని భద్రపర్చిన సంగతి ఇంట్లో దొరికిన రసీదు ద్వారా అతని తల్లి అనా ఓబ్రెగాన్‌కు తెలిసింది. దాంతో తండ్రి కావాలన్న తన కొడుకు కోరికను నెరవేర్చాలని ఆమె నిర్ణయించుకుంది. అనుకున్నదే ఆలస్యం 2023లో కొడుకు వీర్యంతో సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాజాగా ఆ సంగతిని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది.