Sergio Jimenez | డబ్బుల కోసం లైవ్‌లో డ్రగ్స్ సేవించి.. ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ఛాలెంజ్
Sergio Jimenez | మాయదారి సోషల్ మీడియా.. ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణం తీసింది. పెయిడ్ వ్యూయర్స్ కోసం చేసిన ఛాలెంజ్‌లో స్పానిష్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయాడు.
Sergio Jimenez | సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కోసం కొందరు ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు. ఎక్కడున్నాం..? ఏం చేస్తున్నాం..? ఇవేవీ పట్టించుకోకుండా స్టార్ డమ్ కోసం
ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా వ్యూయర్స్ ఇచ్చే డబ్బుకు ఆశపడి ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్పెయిన్ (Spain) చెందిన సెర్గియో జిమెనెజ్ (Sergio Jimenez) అనే 37 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. నెటిజన్ల నుంచి రకరకాల ఛాలెంజ్‌లు స్వీకరిస్తుంటారు. న్యూఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. అందులో పెయిడ్ వ్యూయర్స్ కోసం ఒక ఛాలెంజ్‌లో (paid online challenge) పాల్గొన్నాడు. ఆ ఛాలెంజ్‌లో భాగంగా ఆరు గ్రాముల కొకైన్ (cocaine), ఒక బాటిల్ విస్కీ
(whisky) స్వీకరిస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు తగ్గట్టే లైవ్‌లో ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఆ కొద్దిసేపటికే అతడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతడి తల్లి లేచి చూడగా.. సెర్గియో నేలపై పడిపోయి ఉన్నాడు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఎంత పిలిచినా అతడు
లేవకపోవడంతో ఆందోళన చెందింది. తన కుమారుడు మరణించినట్లు గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెర్గియో గతంలో కూడా ఇలా లైవ్ స్ట్రీమింగ్ లో డబ్బుల కోసం డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటని..? ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Double Decker Motorhome | రోడ్లపై పరుగులు తీసే 5స్టార్ హోటల్.. లంబోర్ఘిని డబుల్ డెకర్ మోటర్‌హోమ్.. విశేషాలివి!!
Vastu Tips for Broom | చీపురును నిలబెట్టారో.. ఇంట్లో నిప్పులే..! జర జాగ్రత్త సుమా..!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram