వ్యక్తి కడుపులో 11 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సిల్స్..

అప్పుడప్పుడు నిజ జీవితాల్లో కూడా సినిమా ఫక్కీలో ఘటనలు జరిగి పోతుంటాయి. అటువంటిదే ఇది కూడాను

వ్యక్తి కడుపులో 11 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సిల్స్..

అప్పుడప్పుడు నిజ జీవితాల్లో కూడా సినిమా ఫక్కీలో ఘటనలు జరిగి పోతుంటాయి. అటువంటిదే ఇది కూడాను

స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు

ముంబై : అప్పుడప్పుడు నిజ జీవితాల్లో కూడా సినిమా ఫక్కీలో ఘటనలు జరిగి పోతుంటాయి. అటువంటిదే ఇది కూడాను. ఓ వ్యక్తి తన కడుపులో 74 క్యాప్సిల్స్‌లో దాచిపెట్టిన 11 కోట్లకు పైగా విలువైన కొకైన్‌ను స్మగుల్‌ చేయడానికి ప్రయత్నించి.. దొరికిపోయాడు. సియర్రాలియోన్‌ దేశస్తుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అరెస్టు జేసినట్లు ఓ అధికారి తెలిపారు. 1,108 గ్రాముల బరువున్న డ్రగ్స్ క్యాప్సిల్స్‌ను ప్రయాణికుడి శరీరం నుంచి శనివారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రి వైద్యులు బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులకు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా సియర్రా లియోన్ జాతీయుడిని మార్చి 28న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఎస్ఎంఐఏ) వద్ద డిఆర్ఐ బృందం పట్టుకున్నట్లు స్మగ్లింగ్ నిరోధక ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ సందర్భంగా నిషేధిత మాదకద్రవ్యాన్ని భారత్‌కు తరలించే ప్రయత్నంలో కొకెన్ క్యాప్సిల్స్‌ను తీసుకున్నట్లు ఆ వ్యక్తి డిఆర్ఐ అధికారులకు చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు జేజే ఆసుపత్రిలో సదరు వ్యక్తిని చేర్పించారు.వైద్యుల బృందం అతని పొత్తికడుపు నుండి ఏకంగా 74 క్యాప్సిల్స్ తొలగించినట్లు అధికారి తెలిపారు. ఆ వ్యక్తిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ (ఎన్డీపీఎస్‌) చట్టం కింద అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపించినట్లు అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ తరహా కేసు ముంబై విమానాశ్రయంలో ఈ వారంలో ఇది రెండవది. మార్చి 24న ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక మహిళ 19 కోట్ల 79 లక్షల విలువైన 1,979 గ్రాముల కొకైన్ తో అరెస్టు అయింది. ఆమె షూస్, మాశ్చరైసర్, షాంపూ బాటిల్స్ వంటి వాటిల్లో డ్రగ్స్‌ను దాచి పెట్టింది.