A lot of drugs were seized | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 15కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.15 కోట్ల విలువైన 998 గ్రాముల కొకైన్ విమానాశ్రయ తనిఖీ సిబ్బంది పట్టుకుని సీజ్ చేశారు.

A lot of drugs were seized | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 15కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

ప్రయాణికుడు మింగిన 63క్యాప్సుల్స్‌లోని కొకైన్‌ స్వాధీనం

A lot of drugs were seized | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్(Drugs) పట్టుబడింది. రూ.15 కోట్ల విలువైన 998 గ్రాముల కొకైన్ (Cocaine)విమానాశ్రయ తనిఖీ సిబ్బంది పట్టుకుని సీజ్ చేశారు. కొకైన్‌తో నింపిన 63 క్యాప్సూల్స్‌ని మింగిన టాంజానియాకు చెందిన దార్ ఎస్ సలామ్‌(Dar es Salaam of Tanzania) టాంజానియా నుంచి అడిస్ అబాబా, దోహా మీదుగా ఢిల్లీకి చేరుకున్నాడు. కస్టమ్స్ తనిఖీల్లో(customs inspections) భాగంగా అనుమానంతో అతడిని విచారించగా, కొకైన్ క్యాప్సూల్స్ (Cocaine capsules)మింగినట్లు బయటపడింది. దీంతో అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. అతన్ని చికిత్స కోసం సఫ్టర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 1న టాంజానియాకు చెందిన వ్యక్తి వైద్యులు అతని శరీరం నుండి 63 క్యాప్సూల్సు బయటకు తీశారు. ఈ క్యాప్పూల్స్‌ శరీరం నుంచి తీసినప్పుడు అందులో 998 గ్రాముల తెల్లటి పౌడర్(White powder) కనిపించింది. సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వ్యక్తులు ఈ పౌడర్ ను కొకైన్‌ మత్తుమందుగా గుర్తించారు. ఈ క్రమంలో దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. 998 గ్రాముల కొకైన్ విలువ రూ.14.97 కోట్లు అని కస్టమ్స్ శాఖ(Customs Department) తన ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి మత్తుపదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు.