వేల కోట్లు ఉన్నా కూడా రోడ్డున పడ్డ జెడి చక్రవర్తి ఫ్యామిలీ.. అసలేం జరిగిందంటే..!

టాలీవుడ్‌లో విభిన్నమైన కథా చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించిన వారిలో జెడి చక్రవర్తి ఒకరు. విలన్, హీరో, నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు అందుకున్నారు. నాగార్జున శివ సినిమాలో విలన్‌గా నటించి తెలుగు తెరకు పరిచయం అయిన చక్రవర్తి ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. జెడి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాలలో మనీ, మనీమనీ, గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, అనగనగా ఒక రోజు, నవ్వుతూ బతకాలిరా, ప్రేమకు స్వాగతం, హోమం వంటివి ఉన్నాయి. విలన్‌గా కూడా జెడి అద్భుతమైన ప్రదర్శనమైన కనబరిచి అందరిని ఆకట్టుకున్నాడు.
అయితే ఎందుకో మధ్యలో సినిమాలకి గ్యాప్ ఇచ్చిన జెడి చాలా గ్యాప్ తర్వాత ఇటీవల `దయా` అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపై రెగ్యూలర్‌గా సినిమాలు చేయబోతున్నట్టు కూడా తెలియజేశారు. ఇటీవల తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలని మీడియా ముఖంగా చెప్పగా, అందులో ఒక క్లిప్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. తన జీవితంలోని రెండేళ్ల బ్యాడ్ ఫేజ్‌కి సంబంధించి జెడి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి. హైదరాబాద్‌లో తనకు వందల కోట్లు విలువల చేసే వంద ఎకరాల ల్యాండ్ ఉండేదట. అలానే రాజమండ్రిలోనూ వేల ఎకరాల ల్యాండ్ ఉందట. కాని అవన్నీ హరించుకపోయాయని టాక్.
జేడీ వయస్సు 13ఏళ్లు ఉన్నప్పుడు తన నాన్న చనిపోయాడు. దీంతో అమ్మే అంతా చూసుకుందని ఆయన తెలిపారు. రాత్రి తనతో పడుకున్న నాన్న మార్నింగ్ లేచే సరికి లేకపోవడంతో ఆ బాధని తట్టుకోలేకపోయినట్టు స్పష్టం చేశారు. తన మదర్ చాలా బాధగా, భారంగా ఫీలయ్యారని ఆయన అన్నారు. అయితే భర్త చనిపోయినప్పుడు భర్త ఆస్తి భార్యకి రావాలంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలట. దానికి దాదాపు రెండేళ్లు పట్టిందట. అప్పట్లో దాదాపు ఒక ఎకరం స్థలంలో ఇళ్లు ఉండేదట. పనివాళ్లు ఉండేవారట. లగ్జరీ హోమ్ అని, రాయల్ లైఫ్ ఉండేదని, కానీ నాన్న చనిపోయాక అవన్నీ పోయినట్టు జెడి చక్రవర్తి అన్నారు. సర్టిఫికెట్ వచ్చేంత వరకు కూడా చిక్కడపల్లిలో ఒక చిన్న ఇంటిలో రెంట్‌కి ఉన్నామని, దాదాపు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యామని, అది మాకు గొప్ప గుణపాఠం నేర్పిందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. నాన్న చనిపోయాక ఒక్కసారి రాయల్ లైఫ్ నుంచి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని, అవన్నీ అమ్మ ఫేస్ చేసిందని స్పష్టం చేశాడు