ఉంగరాలు మార్చుకొని సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కిరణ్ అబ్బవరం.. పెళ్లెప్పుడంటే..!

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యే పరిచయాలు అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటించిన కిరణ్.. ఆ తర్వాత ‘రాజావారు రాణీగారు’ అనే చిత్రంతో తెలుగు చిత్ర సీమకి హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాలోనే తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా తర్వాత మనోడికి చాలానే ఆఫర్స్ వచ్చాయి. ‘ఎస్సార్ కళ్యాణమండపం’తో అనే చిత్రం కూడా కిరణ్ అబ్బవరానికి మంచి హిట్ అందించింది. ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. అయితే కిరణ్ అబ్బవరం రాజావారు.. రాణీగారు చిత్రంలో నటించిన హీరోయిన్ రహస్య గోరక్‌తో ప్రేమలో పడ్డాడు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, ఇన్నాళ్ల పాటు దానిని సీక్రెట్‌గా ఉంచారు.
పలు మార్లు వీరి రిలేషన్ షిప్‌కి సంబంధించి అనేక ప్రచారాలు సాగిన ఇద్దరు పెద్దగా స్పందించింది లేదు. కాని రీసెంట్‌గా తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేశారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో మార్చి 13న వీరిఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఎంగేజ్‌మెంట్‌కి హాజరైనట్టు తెలుస్తుంది. ఉంగరాలు మార్చుకొని ఈ జంట నిశ్చితార్థ వేడుక జరుపుకోగా ఆగస్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి కిరణ్, రహస్యల ఎంగేజ్‌మెంట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఎంగేజ్‍మెంట్ వేడుకలో కిరణ్ అబ్బవరం లైట్ పింక్ కలర్ కుర్తా ధరించారు. పీచ్ కలర్ చీరను రహస్య ధరించారు. ఇద్దరూ చూడముచ్చటగా కనిపిచడంతో వారిద్దరిపై కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, ఎస్ ఆర్ కళ్యాణ మండపం` తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. `సెబాస్టియన్ పీసీ524`, `సమ్మతమే`, `నేను మీకు బాగా కావాల్సిన వాడిని` చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . `వినరో భాగ్యము విష్ణుకథ` ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. తర్వాత వచ్చిన `మీటర్`, `రూల్స్ రంజాన్` అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆయన `దిల్‌రూబా` చిత్రంలో నటిస్తున్నారు. ఇక రహస్య ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.