Big Breaking | విజయ్–రష్మికల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్… పెళ్లి ముహూర్తం ఫిబ్రవరిలోనే!
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అత్యంత గోప్యతతో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ తర్వాత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనుంది.
Vijay Deverakonda–Rashmika Mandanna Engagement
Big Breaking | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే వీరిద్దరూ ఎప్పుడూ తమ బంధంపై అధికారికంగా ఒక్క మాటా మాట్లాడలేదు. సోషల్ మీడియా పోస్టులు, ఫారిన్ ట్రిప్స్, వెకేషన్ ఫొటోలు మాత్రం ఎప్పటికప్పుడు వీరి రిలేషన్‌ను అభిమానులకు స్పష్టంగా చూపించాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వీరి మధ్య ఏర్పడిన స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారిందన్నది సినీ వర్గాల టాక్.

తాజాగా ఈ జంట తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించారు. శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం విజయ్ దేవరకొండ ఇంట్లో అత్యంత గోప్యతతో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. ఉంగరాలు మార్చుకున్న ఫొటోలు బయటకు రాకపోయినా, రష్మిక షేర్ చేసిన చీరకట్టులో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇవే ఎంగేజ్‌మెంట్ పిక్స్ అని అభిమానులు భావిస్తున్నారు.
విజయ్–రష్మిక పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2026లో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ. ఇప్పటివరకు వీరిద్దరూ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ ఎంగేజ్‌మెంట్ వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ దేవరకొండ తాజాగా ‘కింగ్‌డమ్’ సినిమాతో మరో హిట్ కొట్టాడు. రష్మిక మందన్న బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ బిజీగా ఉన్నారు. ఈ జంట పెళ్లి ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎదురుచూసే సెలబ్రిటీ వెడ్డింగ్‌గా మారింది. అభిమానులు ఏళ్లుగా ఎదురుచూసిన ఈ వార్త బయటకు రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram