ర‌ష్మికని అంద‌రు స‌పోర్ట్ చేస్తుంటే, ఆ హీరోయిన్ మాత్రం అంత మాట అనేసింది ఏంటి?

ర‌ష్మికని అంద‌రు స‌పోర్ట్ చేస్తుంటే, ఆ హీరోయిన్ మాత్రం అంత మాట అనేసింది ఏంటి?

స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో దేశ వ్యాప్తంగా ఎంత‌ తీవ్ర దుమారం రేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ ఇష్యూపై సినీ ప్రముఖుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తూ త‌మ‌దైన శైలిలో కామెంట్ చేశారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయ‌డంతోనే అస‌లు వివాదం మొద‌లైంది. అయితే ఈ చేయ‌డాన్ని నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, చిన్మయి, మంచు విష్ణు, కేటీఆర్ ఇలా చాలా మంది ఖండించారు.

గ‌తంలో త‌మ‌న్నా స్థానంలో సిమ్రన్ మొహాన్ని పెట్టి ఏఐ వీడియో క్రియేట్ చేయ‌గా, అప్ప‌ట్లో ఈ విష‌యం కూడా హాట్ టాపిక్ అయింది..ఏఐ టెక్నాలజీ ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ర‌ష్మ‌క వీడియోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలో హీరోయిన్ మాధ‌వీల‌త త‌న సోష‌ల్ మీడియా ద్వారా మరో కోణాన్ని స్పృశించింది. ఇంత వరకు వచ్చిన వాదన కన్నా.. మాధవీలత వాదన కాస్త డిఫరెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఆమె వాద‌న‌ని చాలా మంది ఏకీభ‌విస్తున్నారు. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై మాధవీలత స్పందిస్తూ … రష్మిక ఫేస్‌ ని మరో అమ్మాయి బాడీకి అటాచ్ చేశారు. అయితే ఆ వీడియోలో అంత సభ్యంగా ఏమిలేదు.

రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్ లో వేసుకునే డ్రెస్ ల కంటే ఇది ఏమి అంత‌ వల్గర్ గా ఏమిలేదు. కాకపోతే సైజులో తేడా అంతే అంటూ మాధవీలత పచ్చిగా కామెంట్ చేసింది. స్టార్ హీరోయిన్లు ఎప్పుడైతే ఒక ఇష్యూని రైజ్ చేస్తారో అది పెద్ద డిబేట్ టాపిక్ గా మారిపోతుంది. కాబట్టి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై అన్ని వర్గాల వారు స్పందిస్తూ దీనిని ఖండిస్తున్నారు. జర్నలిస్టులు కూడా రష్మికకి మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేయ‌డం చూసి నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు రష్మికకి మద్దతు తెలుపుతున్న వారంతా సామాన్య ఆడపిల్లలు, మహిళల భద్రతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అనేది ప్రశ్న ? ర‌ష్మిక‌లాంటి వాళ్ల‌కి కాదు మీరు స‌పోర్ట్ చేయాల్సింది, సామాన్యుల‌కి అని చెప్పుకొచ్చింది మాధ‌వీల‌త‌. సావిత్రిగారు, సాయి ప‌ల్ల‌వి విష‌యంలో జ‌రిగితే మ‌నం త‌ప్పుని ఎత్తి చూపాలి. ఆ వీడియోలో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అంత అసభ్యంగా ఏమి లేదు. అది స్విమ్ సూట్ మాదిరిగా ఉంద‌ని మాధ‌వీల‌త స్ట‌న్నింగ్ కామెంట్ చేసింది.