సైకిల్ టైర్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేశాడు.. నెటిజన్లు ఫిదా
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక్కొక్కరికి ఒక్కో ఐడియా వచ్చేస్తోంది. కొందరైతే ఐడియా వచ్చిన వెంటనే అమలు చేసేస్తుంటారు.

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక్కొక్కరికి ఒక్కో ఐడియా వచ్చేస్తోంది. కొందరైతే ఐడియా వచ్చిన వెంటనే అమలు చేసేస్తుంటారు. ఆ మాదిరిగానే ఓ యువకుడు కూడా తనకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్ చేసేశాడు. పేదింటి యువకుడైన అతను ఓ సైకిల్ టైర్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేశాడు. ఆ యువకుడి తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అబ్దుల్ జలీల్ అనే ఇన్‌స్టా గ్రాం యూజర్ ఈ క్రియేటివిటినీ అమలు చేశాడు. తన ఇంట్లో ఉన్న ఓ పాత సైకిల్ టైర్‌ను తీసుకుని, దాన్ని డైనింగ్ టేబుల్‌గా మార్చేశాడు. మోకాళ్ల ఎత్తులో టైర్‌కు కింది భాగంలో సపోర్ట్ ఏర్పాటు చేసి అది రౌండ్‌గా తిరిగేలా ప్లాన్ చేశాడు. ఇక దానిపై రకరకాల వంటకాలు ఉంచాడు. సలాడ్, చేపల కూర, పప్పు, గుడ్డు వంటి ఆహార పదార్థాలను ఉంచి, ఇక తాను చైర్‌పై కూర్చొని భుజించాడు. అవసరం ఉన్న పదార్థాన్ని తన వైపు రొటేట్ చేసుకుంటూ, ఓ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తిన్న ఫీలింగ్‌ను అతను అనుభవించాడు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నాలుగు లక్షల మంది వీక్షించారు. సైకిల్ డైనింగ్ టేబుల్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న యువతకు తెలివి బాగుంటుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఐడియాలు నాన్ ఇండియన్స్‌కు రావు అని తెలిపారు.