మైనర్ బాలికతో పెళ్లి.. పది రోజులుగా లైంగికదాడి
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

మైనర్ బాలికతో పెళ్లి.. పది రోజులుగా లైంగికదాడి
రాజస్థాన్‌లో దారుణం
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
అతడికి బాలిక కుటుంబ సభ్యులు ఒకరిద్దరు దొంగచాటుగా సహకరించారని. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు తాను పెళ్లి చేసుకున్నానని భర్త చెపుతున్నాడు. ఆ బాలికను భర్త ఒక గదిలో బంధించి పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
చివరికి అతని అరాచకం తట్టుకోలేక ఆ బాలిక తన బాధ అంతా తన తల్లితో వెళ్లబోసుకున్నది. దానితో తల్లి తన కూతుర్ని తీసుకొని అజ్మీర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన అరాచకంపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అజ్మీర్ ఏఎస్పీ మహమూద్ ఖాన్ తెలిపారు.
బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పారు. బలవంతంగా పెళ్లి చేసుకుని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని చట్టం ముందు నిలబెడుతామని అన్నారు. సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడేవారికి ఉరి శిక్ష విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తెచ్చిన మర్నాడే ఈ ఘటన వెలుగు చూసింది