ప్ర‌భాస్ రాజాసాబ్ క‌థ‌ని లీక్ చేసిన ఐఎండీబీ.. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన మారుతి

ప్ర‌భాస్ రాజాసాబ్ క‌థ‌ని లీక్ చేసిన ఐఎండీబీ.. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన మారుతి

స‌లార్ చిత్రంతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్ త్వ‌ర‌లో మ‌రి కొన్ని సినిమాల‌తో అలరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. రానున్న రోజుల‌లో ఫ్యాన్స్‌కి మాత్రం మంచి ఫీస్ట్ ద‌క్క‌నుండ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం మారుతి రాజా సాబ్, నాగ్ అశ్విన్ క‌ల్కి చిత్రాలు సెట్స్ పై ఉండ‌గా, సందీప్ వంగా మూవీ షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతుంది. అయితే సంక్రాంతి సంద‌ర్భంగా మారుతి- ప్ర‌భాస్ కాంబోలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో వింటేజ్ ప్రభాస్ ను చూపించి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు మేక‌ర్స్. ఇక మూవీ క‌థ‌కి సంబంధించి కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్‌సైట్ ఐఎండీబీ.. ‘రాజాసాబ్’ మూవీ స్టోరీ లైన్ గురించి ఒక డిస్క్రిప్షన్ పెట్టింది. “ఈ సినిమా కథ ఒక కపుల్ చుట్టూ తిరుగుతుందని, ప్రేమలో పడిన ఇద్దరి వ్యక్తుల డెస్టినీ నెగటివ్ ఎనర్జీ వల్ల వేరే దారి మళ్లుతుందని చెప్పుకొచ్చింది. దీనిపై ద‌ర్శ‌కుడు మారుతి గ‌ట్టిగా స్పందించారు.అరెరే.. నాకు ఇది తెలియక.. వేరే స్క్రిప్ట్ తో సినిమా షూట్ చేస్తున్నానే..మరి ఈ కథని ఐఎండీబీ సమాజం అంగీకరిస్తుందా ?” అంటూ తనదైన స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చాడు మారుతి. ప్ర‌స్తుతం మారుతి ఇచ్చిన కౌంట‌ర్ చాలా మందికి న‌వ్వు తెప్పిస్తుంది.

ఇక రాజా సాబ్ విష‌యానికి వ‌స్తే ఈ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నార‌ట‌. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే 50 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ ని శ‌ర‌వేగంగా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రాజా సాబ్ చిత్రాన్ని తీసుకురావాల‌ని మారుతి ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజా సాబ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ పైకొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గ్రాఫిక్స్ తో పోస్ట‌ర్ రూపొందించార‌ని కొంద‌రు సెటైర్స్ వేశారు.