KTR | ఏది కావాలి మ‌న‌కు..? ఆలోచించు తెలంగాణ రైత‌న్నా.. కేటీఆర్ ట్వీట్

KTR | ఏది కావాలి మ‌న‌కు..? ఆలోచించు తెలంగాణ రైత‌న్నా.. కేటీఆర్ ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు రైతుల చుట్టే తిరుగుతున్నాయి. రైతుబంధు, ధ‌ర‌ణి, 24 గంటల క‌రెంట్ వంటి ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. తాము అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణి ఎత్తేస్తామ‌ని, వ్య‌వ‌సాయానికి 3 గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేక‌పోతుంద‌ని, దాంతో అన్న‌దాత‌లు రోడ్డున ప‌డ్డార‌ని అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. క‌ర్ణాట‌క ప‌రిస్థితే తెలంగాణ‌లో త‌లెత్తె అవ‌కాశం ఉంద‌ని అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ఈక్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ ప‌థ‌కాల‌ను, క‌ర్ణాట‌క‌లో అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ ప‌థ‌కాల‌ను బేరిజు వేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏది కావాలి మ‌న‌కు..? ఆలోచించు తెలంగాణ రైత‌న్నా అని కేటీఆర్ మ‌న‌వి చేశారు.

కేసీఆర్ క‌డుపు నిండా ఇస్తున్న 24 గంట‌ల ఉచిత క‌రెంట్ కావాల్నా..? లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాల్నా..? లేకపోతె తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాల్నా..? ఆలోచించు తెలంగాణ రైతన్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు కావాల్నా ? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్సఫార్మర్లు మళ్ళి ఆ రోజులు రావాల్నా? లేదా రైతుబంధు ఇచ్చి, రైతుబీమా తెచ్చి, చెరువులు బాగుచేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసిన కేసీఆర్ కావాల్నా..? ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ రైతుల‌కు సూచించారు.