నాగార్జునది నిజమైన జుట్టు కాదా, విగ్గా.. మేకప్ మెన్ చెప్పిన షాకింగ్ విషయాలు

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అందానికి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున ఇప్పటికీ అమ్మాయిల మనసులు దోచుకుంటూనే ఉంటాడు. అయితే హీరోలలో చాలా మంది విగ్గులు వాడతారు అనే విషయం మనందరికి తెలిసిందే. నాగార్జునది కూడా విగ్గే అని, అది ఆయన నిజమైన జట్టు కాదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేకప్ మ్యాన్ చంద్ర ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
నాగార్జునకి పర్సనల్ మేకప్ మ్యాన్‌గా మూడు దశాబ్ధాల తరబడి పని చేసిన చంద్ర.. అక్కినేని ఫ్యామిలీలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరికీ మేకప్ వేశారు. ఆయనతో మేకప్ వేయించుకున్న వారందరు టాప్ పొజీషన్‌లోకి వెళతారనే టాక్ ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో చంద్ర మాట్లాడుతూ.. నాగార్జున ఫ్యామిలీ తనను మేకప్ మ్యాన్‌గా కాకుండా ఫ్యామిలీ మ్యాన్‌గా చూసుకునే వారు అని అన్నాడు. నాగార్జున అన్నమయ్య సినిమాలో తప్ప ఏ సినిమాలో విగ్గు వాడలేదని అన్నాడు. మిడిల్ ఏజ్ వ్యక్తిగా చూపించే సమయంలో విగ్గు వాడాము. ఇప్పటికీ నాగార్జున విగ్గు పెట్టుకోరు.
ఆయన జుట్టు చాలా బాగుంటుంది. ఆయన చాలా సినిమాలలో విగ్గు ఉండదు, కేవలం హెయిర్ ఎక్స్‌టెన్షన్ మాత్రమే చేసే వాళ్లం. ‘అల్లరి అల్లుడు’ సినిమా కోసం భుజాల వరకు జుట్టు పెంచుకున్నారు. నన్ను ఆయన కుటుంబంలో మనిషిలా చూసుకునే వార తప్ప జీతం ఇస్తున్నాం పనివాడు అని ఏ రోజు భావించలేదు. ఒకే ఒక్క కారణంతో ఆయనకు దూరం కావాల్సి వచ్చిందని చంద్ర చెప్పారు. “మా అమ్మకు వయస్సు ఎక్కువై మతిస్థిమితం ఉండకపోవడం వలన ఆమెని చూసుకోవల్సి వచ్చేది, అలానే నాగార్జున గారికి మేకప్ మ్యాన్‌గా పని చేయాల్సి వచ్చేంది. రెండు మేనేజ్ చేయలేకపోయాను. ఓ సారి అమ్మకి సీరియస్‌గా ఉండడంతో అతనికి చెప్పకుండా వెళ్లిపోయాను. దాంతో తెల్లారి నాపై సీరియస్ అయ్యారు. రాత్రి ఏమైన అయి ఉంటే ఏంటి పరిస్థితి అని అన్నారని చంద్ర చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తర్వాత మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని, ఇప్పుడు ఎక్కడైన కలిసిన బాగానే పలకరిస్తారు అని చంద్ర అన్నారు.