Hippo Vs Lions | బతుకుజీవుడా: సింహాలను.. ఉరికించిన నీటి గుర్రం! తృటిలో తప్పించుకున్న మృగరాజులు

Viral Video, Hippo Vs Lions విధాత‌: అడవికి మృగరాజే సింహం.. సో వాట్‌! రోజు తనది కానప్పుడు ఇంకో జంతువుకు బలి కావలిసిందే. అచ్చం అలాంటి ఘటనే ఇది. ఇక అడవిలో ఉండే జలాశయాలకు, పారే నదులకు హిప్పొపోటమస్‌ (నీటి గుర్రం) నిస్సందేహంగా రారాజు. అలాంటిది తన పరిధిలోకి వచ్చాయని కోపం వచ్చిందో ఏమో గానీ.. ఆ నీటి గుర్రం సింహాలను తరిమి కొట్టింది. ఇక మ్యాటర్‌లోకి వెళితే మూడు సింహాలు కలిసి వాటి మానాన […]

Hippo Vs Lions | బతుకుజీవుడా: సింహాలను.. ఉరికించిన నీటి గుర్రం! తృటిలో తప్పించుకున్న మృగరాజులు

Viral Video, Hippo Vs Lions

విధాత‌: అడవికి మృగరాజే సింహం.. సో వాట్‌! రోజు తనది కానప్పుడు ఇంకో జంతువుకు బలి కావలిసిందే. అచ్చం అలాంటి ఘటనే ఇది. ఇక అడవిలో ఉండే జలాశయాలకు, పారే నదులకు హిప్పొపోటమస్‌ (నీటి గుర్రం) నిస్సందేహంగా రారాజు. అలాంటిది తన పరిధిలోకి వచ్చాయని కోపం వచ్చిందో ఏమో గానీ.. ఆ నీటి గుర్రం సింహాలను తరిమి కొట్టింది.

ఇక మ్యాటర్‌లోకి వెళితే మూడు సింహాలు కలిసి వాటి మానాన అవి వాగును దాటేందుకు ఉపక్రమించి నీటిలోకి దిగి నడవడం ప్రారంభించాయి. వాటికి కొద్ది దూరంలోనే ఉన్న హిప్పొపోటమస్‌ సింహాలను గమనించి వాటి పైకి దూసుకెళ్లింది.

దాని వేగాన్ని చూసి ఓ సింహాం అక్కడి నుంచి అటే వెనక్కి పారిపోగా మిగిలిన రెండు సింహాలపై హిప్పొ విరుచుకు పడింది. అందులో ఓ సింహం దాని దూకుడు చూసి తప్పించుకుని పారిపోగా మరో సింహాన్ని హిప్పొ వెంటాడి వెంటాడి తరిమింది. దానిని నోట కరిచేందుకు ప్రయత్నించింది. కానీ ఆ సింహం దానిని నుంచి ఎలాగోలా తప్పించుకుని బతుకుజీవుడా అంటూ ఒడ్డున పడి అక్కడి నుంచి పరారయింది.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిప్పొపోటమస్‌ అనేది క్యూట్‌గా కనిపించే ఫ్రెండ్లీ జంతువు అని మనం కార్టూన్లలో చూసుకుంటూ పెరిగామని ఇంతలా వాయిలెంట్‌గా ఉంటాయని అనుకోలేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.