Baby Hippo vs Lion | సింహానికి చుక్క‌లు చూపించిన హిప్పోపొట‌మ‌స్‌.. వీడియో

Baby Hippo vs Lion | అడవి( Forest )కి రారాజు సింహం( Lion ). దాని ఆహార్యం, పరుగు, గర్జన.. ఇలా అన్నీ ప్రత్యేకమే. మ‌రి అలాంటి సింహాం.. ఇత‌ర జంతువుల‌ను( Animals ) వేటాడి భ‌క్షిస్తుంది. సింహం కంట‌ప‌డ్డ ప్ర‌తి జంతువు ఖ‌తం కాక త‌ప్ప‌దు. కానీ ఓ జంతువు మాత్రం సింహానికి చుక్క‌లు చూపింది.

Baby Hippo vs Lion | సింహానికి చుక్క‌లు చూపించిన హిప్పోపొట‌మ‌స్‌.. వీడియో

Baby Hippo vs Lion | అడవి( Forest )కి రారాజు సింహం( Lion ). దాని ఆహార్యం, పరుగు, గర్జన.. ఇలా అన్నీ ప్రత్యేకమే. మ‌రి అలాంటి సింహాం.. ఇత‌ర జంతువుల‌ను( Animals ) వేటాడి భ‌క్షిస్తుంది. సింహం కంట‌ప‌డ్డ ప్ర‌తి జంతువు ఖ‌తం కాక త‌ప్ప‌దు. కానీ ఓ జంతువు మాత్రం సింహానికి చుక్క‌లు చూపింది. ఆ జంతువు దెబ్బ‌కు సింహం తోక ముడిచి యుద్ధ క్షేత్రం నుంచి ప‌రారైంది.

అది సౌతాఫ్రికా( South Africa )లోని క్రుగేర్ నేష‌న‌ల్ పార్క్( Kruger National Park ).. ఓ న‌ది ఒడ్డున హిప్పోపొట‌మ‌స్( Hippopotamus ) త‌న బిడ్డ‌తో క‌లిసి సేద తీరుతుంది. అటుగా వ‌చ్చిన ఓ సింహం.. ఆ త‌ల్లీబిడ్డ‌ను చూసింది. అలిసిపోయి అచేత‌నంగా ఉన్న హిప్పోపొట‌మ‌స్‌పై దాడి చేసేందుకు సింహం య‌త్నించింది. కానీ పిల్ల హిప్పోపొట‌మ‌స్ ఏ మాత్రం బెద‌ర‌లేదు.

మృగ‌రాజు సింహాంతో ఫైట్ చేసింది. త‌న త‌ల్లి ద‌గ్గ‌రికి రానివ్వ‌కుండా అడ్డుకుంది. సింహానికి చుక్క‌లు చూపించింది. చివ‌ర‌కు సింహాం చేసేదేమీ లేక‌.. హిప్పోపొట‌మ‌స్ దెబ్బ‌కు తోక‌ముడిచి అటు నుంచి ప‌రారైంది. ఈ ఘ‌ట‌న 2016లో చోటు చేసుకున్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఆ వీడియో వైర‌ల్ అవుతుంది. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి మ‌రి.