Leopard Stands On Hind Legs | వేట కోసం చిరుతల ‘ఎత్తు’.గడలు..చూస్తే షాక్
క్రుగర్ పార్క్ లో చిరుత వెనుక కాళ్లపై నిలబడి వేట కోసం చేసిన ఎత్తుగడ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విధాత: ఆహారం కోసం చిరు జంతువులను వేటాడేందుకు వన్యమృగాలు వేసే ఎత్తుగడలు అన్ని ఇన్ని కావు. పొదల్లో సడి సప్పుడు లేకుండా పొంచి ఉండటంతో పాటు దూరానా ఉన్న జంతువులను పరిశీలించేందుకు పులులు, చిరుతలు, సింహాలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి. చిరుతలైతే ఏకంగా ఎతైన చెట్లపైకి ఎక్కి మాటు వేసి దూరాన ఉన్న జంతువులు కదలికలను పసిగట్టి..వేగంగా వాటిని చేరుకుని వేటాడం చేస్తుంటాయి. తనకన్న బలమైన సింహాలు, పులుల వంటి వాటి దాడుల నుంచి తప్పించుకునేందుకు వేగంగా చెట్లపైకి ఎక్కేస్తుంటాయి.
తాజాగా క్రుగర్ నేషనల్ పార్క్ లో ఓ చిరుత దూరాన ఉన్న వేట జంతువు లను పసిగట్టేందుకు రోడ్డుపైన మనిషి మాదిరిగా నిలబడి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత తన వెనుక కాళ్లపై నిలబడి పచ్చిక బైళ్లలో ఉన్నజంతువులను గమనిస్తూ మెల్లగా తన ‘ఎత్తు’గడతో వేట లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మనిషి మాదిరిగా చిరుత నిలబడిన తీరు చూసిన నెటిజన్లు జంతువులు కూడా మనుషుల మాదిరిగా తెలివిమీరిపోయాయంటు కామెంట్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram