Viral Video | మృగరాజుల నుంచి తప్పించుకున్న గజరాజు

Viral Video | అడవికి మృగరాజు సింహాం. తమ కంటికి కనిపించిన ప్రతి జంతువును సింహాలు వేటాడి భక్షిస్తాయి. అలాంటి సింహాల కంట పడకుండా మిగతా జంతువులు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒక వేళ మృగరాజులకు తారసపడ్డా.. వాటి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తాయి. అయితే ఓ పిల్ల ఏనుగు కూడా సింహాల దాడి నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికాలోని క్రగర్ నేషనల్ పార్కులో ఓ పిల్ల ఏనుగు తన తల్లి నుంచి మిస్ అయింది. ఇక పిల్ల ఏనుగును గమనించిన ఓ మగ సింహాం దాన్ని అనుసరించింది. మరో రెండు సింహాలు కూడా ఆ ఏనుగును ఫాలో అయ్యాయి. ఇక మూడు సింహాలు కలిసి పిల్ల ఏనుగును వేటాడేందుకు యత్నించాయి. నిమిషానికి పైగా గజరాజును వెంబడించాయి. కానీ చివరకు ఆ సింహాల నుంచి పిల్ల ఏనుగు తప్పించుకుంది. సింహాలు కూడా వెనుదిరిగాయి. ఈ వీడియోను బ్రెంట్ అనే వ్యక్తి చిత్రీకరించారు. లేటెస్ట్ సైటింగ్స్ అనే యూ ట్యూబ్ చానెల్‌లో దీన్ని అప్‌లోడ్ చేశారు. సెప్టెంబర్ 26న ఈ వీడియోను పోస్టు చేయగా, 2.2 మిలియన్ల మంది వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేశారు.