విడాకులు తీసుకున్న వాళ్లకి మ‌ళ్లీ పెళ్లి ఎందుకు.. న‌వ‌దీప్ సెటైర్ వేసేశాడే..!

  • By: sn    breaking    Nov 18, 2023 11:47 AM IST
విడాకులు తీసుకున్న వాళ్లకి మ‌ళ్లీ పెళ్లి ఎందుకు.. న‌వ‌దీప్ సెటైర్ వేసేశాడే..!

ఇటీవ‌లి కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు చిన్న చిన్న కార‌ణాలకి విడాకులు తీసుకొని త‌మ వైవాహిక జీవితానికి మ‌ధ్య‌లోనే పులిస్టాప్ పెట్టేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇటీవ‌ల ఈ విడాకుల ధోర‌ణి ఎక్కువైంది. ప‌వన్ క‌ళ్యాణ్ ఇద్ద‌రికి విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆయ‌న విష‌యం కొన్నాళ్ల‌పాటు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ కాగా, ఆ త‌ర్వాత చిరు చిన్న కూతురు శ్రీజ బాబాయ్ బాట‌లోనే న‌డిచింది. మొద‌ట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ అత‌నికి విడాకులు ఇచ్చి క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని పెళ్లాడింది. అత‌నితో కూడా శ్రీజ‌కి వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో వారిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక నాగ‌బాబు కూతురు నిహారిక ఈ ఏడాది జూన్‌లో జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌కి విడాకులు ఇచ్చిన‌ట్టు తెలియ‌జేసింది.

వీరే కాక ఇండ‌స్ట్రీలో ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్లి చేసుకొని కొన్ని కార‌ణాల వ‌ల‌న కొద్ది రోజుల‌కే విడాకుల ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. స‌రే విడాకులు తీసుకున్నాక సోలోగా ఉంటున్నారా అంటే కొంద‌రు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితులు చూసిన కొంద‌రు పెళ్లి అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వారిలో హీరో న‌వ‌దీప్ ఒక‌రు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న న‌వ‌దీప్ జై సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఆర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సెకండ్ హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు చిత్రాలు చేశాడు. 2021లో మోసగాళ్లు సినిమాతో థియేట‌ర్స్‌లో సందడి చేసిన నవదీప్ ఆ తర్వాత ఇప్పటివరకు మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ లేదు. అప్పుడప్పుడు పలు సిరీస్ లు చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

న‌వ‌దీప్‌కి మొద‌టి నుండి పెళ్లి అంటే భ‌యం. క‌చ్చితంగా తాను పెళ్లి చేసుకోను అనే అంటాడు. అయితే నవదీప్ వాళ్ళ అమ్మ మాత్రం అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంటుంది. దీనిపై తాజాగా నవదీప్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో న‌వ‌దీప్ మాట్లాడుతూ..ఇవాళ పొద్దున్నే మా మదర్ ఇండియా నన్ను పెళ్లి గురించి ఓ ప్రశ్న అడిగింది. నిజంగా పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే, పెళ్లి వర్కౌట్ అవ్వక విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు అని చెప్పాడు. దీంతో నవదీప్ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోకి జరగాలి పెళ్లి అని కూడా ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. దీంతో పెళ్లి గురించి ఆలోచిస్తున్న న‌వ‌దీప్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాడేమో అని ముచ్చ‌టించుకుంటున్నారు.