ఇదేమి డ్రెస్ నిహారికా? బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ గ్లామ‌ర్ షోకి తెర‌లేపిందిగా..!

  • By: sn    breaking    Mar 02, 2024 11:19 AM IST
ఇదేమి డ్రెస్ నిహారికా? బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ గ్లామ‌ర్ షోకి తెర‌లేపిందిగా..!

ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నిహారిక ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా కూడా నిహారిక‌కి మంచి పేరు ప్రఖ్యాత‌లు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. దీంతో ఈ అమ్మ‌డు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ని వివాహం చేసుకుంది. వీరి పెళ్లి అంగరంగ వైభ‌వంగా జ‌రిగింది. నేష‌న‌ల్ మీడియా సైతం వీరి పెళ్లిని క‌వ‌ర్ చేసింది అంటే ఏ రేంజ్‌లో జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇటీవ‌ల విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు. విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత నిహారిక ఈ విష‌యంపై ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌స్తావిస్తూ వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే నిహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వ‌స్తుంది.

విడాకుల బాధ నుంచి త్వరగా కోలుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కారణమని నిహారిక ఇటీవ‌ల క్లారిటీ ఇచ్చింది. వారితో క‌లిసి తెగ చ‌క్క‌ర్లు వేస్తుంది. సోష‌ల్ మీడియాలో కూడా త‌న హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. నిహారిక తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకోగా, ఆ ఫోటోల్లో కాస్తా హాటుగా పోజులిచ్చింది. జీన్స్ టాప్‌లో అందాల రచ్చ చేస్తున్న నిహారిక‌పై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రోజు రోజుకి నిహారిక ఘాటు అందాల‌తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంద‌ని నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

నటిగా, నిర్మాతగా కెరీర్ పరంగా బిజీ అవుతున్న నిహారికకు భవిష్యత్తులో భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.నిహారిక సొంత బ్యానర్ పై పలు క్రేజీ వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మెగా డాటర్ నిహారిక కొణిదెల రీసెంట్‌గా సాగు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను , ఆ సమయంలో కొందరు సపోర్ట్ గా నిలిచారంటూ ఆస‌క్తికర కామెంట్స్ చేసింది. త్వ‌ర‌లో త‌న బాబాయ్ కోసం ఏపీలో వెళ్లి జ‌న‌సేన పార్టీకి ప్ర‌చారం చేస్తాన‌ని కూడా పేర్కొంది. ఇక త‌న ఓటు ఏపీలోనే ఉందంటూ కూడా నిహారిక తెలియ‌జేసింది.