Varun Sandesh | ఇన్నాళ్లు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యువ హీరో

Varun Sandesh | హ్యాపీ డేస్ సినిమాతో యువతలో మంచి గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమాతో వ‌రుణ్ సందేశ్ కొన్ని మంచి హిట్స్ అందిపుచ్చుకున్నాడు. కాని ఆ త‌ర్వాత కెరీర్ డౌన్ అయింది. బిగ్ బాస్ షోలో త‌న సతీమ‌ణితో క‌లిసి పాల్గొని సంద‌డి చేశాడు. అయితే తాజాగా వ్యక్తిగత విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  • By: sn |    movies |    Published on : Dec 11, 2025 4:26 PM IST
Varun Sandesh | ఇన్నాళ్లు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యువ హీరో

Varun Sandesh | హ్యాపీ డేస్ సినిమాతో యువతలో మంచి గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమాతో వ‌రుణ్ సందేశ్ కొన్ని మంచి హిట్స్ అందిపుచ్చుకున్నాడు. కాని ఆ త‌ర్వాత కెరీర్ డౌన్ అయింది. బిగ్ బాస్ షోలో త‌న సతీమ‌ణితో క‌లిసి పాల్గొని సంద‌డి చేశాడు. అయితే తాజాగా వ్యక్తిగత విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లయి తొమ్మిదేళ్లు పూర్తయినా ఇప్పటికీ వీరికి పిల్లలు లేని కారణంగా అందరూ అడిగే ప్రశ్నలకు మొదటిసారి క్లారిటీ ఇచ్చారు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమా షూటింగ్ సమయంలోనే తమ ప్రేమ మొదలైందని వరుణ్ చెప్పారు. ఒక సీన్‌లో వితికను ఎత్తుకుని పరిగెడుతుండగా ఇద్దరూ కిందపడిపోయారని, అప్పటికీ వితికకు ఉండే నడుమునొప్పి సమస్య కారణంగా ఆమెకు ఎక్కువ నొప్పి రావడంతో తాను చాలా బాధపడ్డానని, ఆ తర్వాత ఆమెతో మాట్లాడేందుకు నెంబర్ తెప్పించుకుని మాట్లాడటం మొదలైందని వెల్లడించారు.

ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఇద్దరి మధ్య బాండ్ బలపడిందని, ఒకసారి తలకు దెబ్బ తగిలినప్పుడు వితిక ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం తనను ఇంకా ఎక్కువగా ఆకట్టుకుందని అన్నారు. తర్వాత వితికను ‘డేట్ చేద్దామా?’ అని అడిగినప్పుడు, డేటింగ్ చేయన‌ని చెప్పింది. పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే చెప్పమని అన‌డంతో తాను వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశానని వరుణ్ తెలిపారు. పెద్దల అంగీకారంతో ఇద్దరి వివాహం జరిగింది. అయితే పెళ్లయి కొంతకాలానికే వితికకు ఒక మిస్ క్యారేజీ కావడంతో ఆమె తీవ్రంగా మానసికంగా కుంగిపోయిందని, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని వరుణ్ చెప్పారు.

తర్వాత వితిక యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేషన్ మొదలుపెట్టి బిజీగా మారి మంచి సక్సెస్ సాధించిందని, తన సంపాదనతోనే ఒక ఇల్లు కొనాలని అనుకునేది. ఆమెకు ఎంతో కాలంగా ఉన్న కోరిక ఇటీవల నెరవేరిందని చెప్పారు. ఇప్పటికే తమకు ఇల్లు ఉన్నప్పటికీ, పూర్తిగా వితిక సంపాదించిన డబ్బుతో ఒక కొత్త ఇల్లు కొనడంతో ఆమె కల తీరిపోయిందని వరుణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మిగిలింది పిల్లలే అని, త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని, తొమ్మిదేళ్లుగా పిల్లల గురించి అడిగే వారు ఇప్పుడు అడగడమే మానేశారని నవ్వుతూ చెప్పారు. మొత్తానికి, వరుణ్–వితిక దాంపత్య జీవితం మరో కొత్త అధ్యాయానికి సిద్ధమౌతున్నట్లు వరుణ్ సందేశ్ చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.