గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్..త్వరలోనే తండ్రి ప్రమోషన్

ఇటీవల మన టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కళ్లుగా పెళ్లి పీటలు ఎక్కడం ఆ తర్వాత తండ్రి ప్రమోషన్ అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాజాగా ఆయన భార్య పల్లవికి సీమంతం వేడుకను నిర్వహించగా, అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ఆ ఫొటోలకి ఎమోషనల్ కామెంట్ జత చేశాడు. నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందించండి అని నిఖిల్ ఎమోషనల్ కామెంట్ చేశారు.
నిఖిల్.. పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020లో డాక్టర్ పల్లవి వర్మను సింపుల్‌గా వివాహం చేసుకున్నాడు. కరోనా సమయం కావడంతో పెద్దగా ఆర్భాటాలు చేయకుండానే వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లకి నిఖిల్ తండ్రి కాబోతుండడంతో ఆయనకు పలువురు ప్రముఖులు,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే కెరీర్‌లో మంచి సక్సెస్‌తో ముందుకు సాగుతున్న నిఖిల్..బేబీ రాకతో మరింత సక్సెస్ అందుకుంటారని భావిస్తున్నారు. ఇక నిఖిల్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌజ్’, ‘చైనా పీస్’ వంటి సినిమాలు ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధం కాబోతున్నాయి. స్వయంభు చిత్రంతో త్వరలోనే పలకరించనున్నాడు.
హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్..కార్తికేయ, స్వామిరారా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత కార్తికేయ 2, 18 పేజీలు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ చేస్తున్న స్వయంభు సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు నిఖిల్.చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనుండగా, ఇందుకోసం తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు.