Medaram Traffic Jam | మేడారంలో ట్రాఫిక్ జామ్‌తో భక్తుల అవస్థలు
గద్దెలపైకి అమ్మవార్లు చేరి దర్శనాలు ఇస్తుండటంతో మేడారంలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. తల్లులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Traffic Jam | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో శుక్రవారం ట్రాఫిక్ జామ్‌తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. జాతరకు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,
రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్, భూపాల్ పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి అమ్మవారు దర్శనం చేసుకున్నారు.
పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అమ్మ వార్లకు మొక్కలు చెల్లించారు.
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ వుమెన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కు గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు అభివృద్ధి గురించి అందులోని విశేషాలు గురించి మంత్రి సీతక్క వివరించారు.

Read Also |
Contract Employees | ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం
PRC delay Telangana | రెండేళ్లయినా తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు అతీగతీ లేని పీఆర్సీ..
వినియోగదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ రూల్స్ నుంచి పొగాకు ధరల వరకు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు ఇవే
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram