ఆస్తులన్ని అమ్ముకుంటున్న ప్రియాంక‌.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

  • By: sn    breaking    Nov 19, 2023 12:42 PM IST
ఆస్తులన్ని అమ్ముకుంటున్న ప్రియాంక‌.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

గ్లోబ‌ల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ చిన్న‌ది… అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గాఎదిగింది. బాలీవుడ్ ను షేక్ చేసిన ప్రియాంక చోప్రా… ఆ తర్వాత తన ప్రియుడు నిక్ జొనాస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైపోయింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేయ‌డం పూర్తిగా త‌గ్గించేసింది. ప్రియాంక హిందీ సినిమాలు చేయ‌క మూడేళ్లు అవుతుంది. 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో క‌నిపించిన ఈ భామ ఆ త‌ర్వాత మ‌రో హిందీ సినిమా చేయ‌లేదు.

కాలిఫోర్నియాలో త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉంటున్న ప్రియాంక చోప్రా అక్క‌డ సినిమాలతో పాటు అక్కడే రెస్టారెంట్‌ బిజినెస్ కూడా చూసుకుంటుంది. రీసెంట్‌గా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పిచింది. అయితే ప్రియాంక‌కి సంబంధించిన కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో ఉన్న‌ప్పుడు కోట్లలో ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్న ఈ భామ ఇప్పుడు వాట‌న్నింటిని అమ్మేస్తుంద‌ట‌. భారతదేశంలో ఉన్న ఓ ప్రాపర్టీని అమ్ముకొని ఆ డబ్బులను తన ఖాతాలో జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోఖండ్ వాలో ఒక కమర్షియల్ ప్రాపర్టీని దాదాపుగా 7 కోట్ల రూపాయలకు అమ్ముకున్న ప్రియాంక చోప్రా.. తాజాగా అంధేరిలో ఉన్న తన అపార్ట్ మెంట్ ను కూడా అమ్మకానికి పెట్టేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పేరొందిన అభిషేక్ చౌబే ఆరు కోట్ల రూపాయలకు ఆ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశార‌ని, గతనెల 23వ తేదీ నుంచి 25వ తేదీల్లో ఈ లావాదేవీలు జరిగనట్లు బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించిందట ప్రియాంక‌. ఒక్కొక్క‌టిగా ప్రియాంక త‌న ఆస్తుల‌ని అమ్ముకోవ‌డం చూస్తుంటే ఈ భామ ఇక బాలీవుడ్‌కి పూర్తిగా దూర‌మైన‌ట్టే అని అభిమానులు భావిస్తున్నారు.