వీడియోల‌తో డ‌బ్బులు సంపాదిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. త‌ల్లి ఆరోగ్యం కోసం తప్ప‌డం లేదంటూ కామెంట్

వీడియోల‌తో డ‌బ్బులు సంపాదిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. త‌ల్లి ఆరోగ్యం కోసం తప్ప‌డం లేదంటూ కామెంట్

బిగ్ బాస్ షోతో చాలా మంది కంటెస్టెంట్స్ తెగ పాపుల‌ర్ అవుతుంటారు. కొంద‌రికి అదృష్టం క‌లిసి వ‌చ్చి స్టార్స్‌గా కూడా మారుతుంటారు. మ‌రికొంద‌రి ప‌రిస్థితి మాత్రం షోకి ముందు ఎలా ఉందో త‌ర్వాత కూడా అలానే ఉంటుంది. అయితే బిగ్ బాస్ షోలో మనం చూసిన కంటెస్టెంట్స్ అంద‌రు చాలా సౌండ్ అని ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తుంటార‌ని కొంద‌రు భావిస్తుంటారు. కాని అది ముమ్మాటికి అస‌త్యం. ఫైనాన్షియ‌ల్ ఇబ్బందుల వ‌ల‌న వారు ప‌డే ఆవేద‌న అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజ‌న్ 7తో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంక జైన్ త‌న త‌ల్లిని కాపాడుకునేందుకు విశ్వ ప్ర‌యత్నాలు చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ప్రియాంక త‌న త‌ల్లికి క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని ఎమోష‌న‌ల్ అయింది.

తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. త‌న త‌ల్లిని ఆసుప‌త్ర‌లో అడ్మిట్ చేసిన‌ట్టు పేర్కొంది. ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించింద‌ని, కీమో థెర‌పీ చేశార‌ని చెబుతూ ఎమోష‌న‌ల్ అయింది. నా త‌ల్లికి జుట్టు అంటే చాలా ఇష్టం. కీమో థెర‌పీ వ‌ల‌న జుట్టు మొత్తం ఊడిపోయింది. త‌న‌కు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు కాని ఆరోగ్యం కోసం త‌ప్ప‌లేదు అంటూ ప్రియాంక చాలా ఎమోష‌న‌ల్‌గా చెబుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌తిసారి ఇలా వీడియోలో చెప్ప‌డానికి కార‌ణం వీటి వ‌ల్లే త‌న‌కి డ‌బ్బులు వ‌స్తున్నాయ‌ని, దాని వ‌ల్ల త‌న త‌ల్లికి ట్రీట్‌మెంట్ అందించ‌గ‌లుగుతున్న‌ట్టు పేర్కొంది. ప్రియాంక మాట‌లు వింటుంటే ఆమె ఆర్థిక ప‌రిస్థితి అంత దారుణంగా ఉందా అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ‌ధ్య ప్రియాంక‌- శివ‌లు తాము పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నామ‌ని కాని అంత డ‌బ్బులు లేక‌పోవ‌డం వ‌ల్లనే పెళ్లి చేసుకోలేద‌ని కూడా చెప్ప‌డం హాట్ టాపిక్ అయింది. బాగా డ‌బ్బులు సంపాదించి ఆ త‌ర్వాత గ్రాండ్‌గా వివాహం చేసుకుంటామ‌ని ప్రియాంక ప్రియుడు శివ అన్నాడు. వీరిద్ద‌రికి పెళ్లి కాక‌పోయిన ఇద్ద‌రు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్దల అంగీకారంతోనే వారు అలా క‌లిసి ఉంటున్న‌ట్టు తెలియ‌జేశారు. వారిపై అనేక ర‌కాలుగా ట్రోలింగ్ జ‌రుగుతున్నా కూడా అవి తాము పట్టించుకోమ‌ని కూడా తెలియ‌జేశారు. ఏది ఏమైన ప్రియాంక ప‌రిస్థితి తెలుసుకొని చాలా మంది ఆవేద‌న చెందుతున్నారు.

తన తల్లిని హాస్పటల్ లో చేర్పించాం అని తెలిపింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని. కీమో థెరపీ చేశారని.. కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లికి జుట్టు అంటే చాలా ఇష్టమని ఇప్పుడు కీమో థెరపీ వల్ల తన జుట్టు మొత్తం పోయిందని తెలిపింది. ఇలా చేయడం తనకు ఇష్టం లేదు అని కానీ ఆమె ఆరోగ్యం కోసం తప్పలేదు అని తెలిపింది ప్రియాంక. ఇదంతా వీడియోలో చెప్పడానికి కారణం కూడా ఉందని తెలిపింది. ఈవీడియోల వల్లే తనకు డబ్బులు వస్తున్నాయని తెలిపింది ప్రియాంక.