తొలి రోజు ఆటలో రబాడ మెరుపులు.. రాహుల్ కీలక ఇన్నింగ్స్

సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఇక 26నుండి టెస్ట్ మ్యాచ్ మొదలు కాగా, తొలి టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్‌కి దిగింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై మన బ్యాట్స్‌మెన్స్ ఎక్కువ పరుగులు చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు. పేస్ అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు విరుచుకుపడడంతో భారత్ 150 పరుగులకే సర్ధుకుంటారని అంతా అనుకున్నారు. కాని కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్ విలువైన భాగస్వామ్యంతో పాటు కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ వలన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 59 ఓవర్లలో 208/8 పరుగులతో కేఎల్ రాహుల్ (70*), మహ్మద్ సిరాజ్ (0*) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఓపెనర్స్ మంచి స్టార్టింగ్ ఇవ్వలేకపోయారు. రోహిత్ శర్మతో కలిసి యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించగా, 10 ఓవర్లలోపే ఓపెనర్లు ఇద్దరు ఔట్ అయ్యారు. ఇక ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన గిల్ కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ 38 పరుగులు చేసి ఔట్ కాగా, అప్పటికీ భారత్ స్కోర్ 121/6 గా ఉంది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ (70*) మంచి బ్యాటింగ్ చేయడంతో 208 పరుగులు చేసింది. రబాడ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. అతని కెరీర్‌లో ఇది 14వ సారి.
శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్.. ఓవైపు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయాలన్నా కుదరలేదు. వెనువెంటనే వెనుదిరిగినా.. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. జస్‌ప్రీత్ బుమ్రా సాయంతో 8వ వికెట్‌కు 27 పరుగులు.. సిరాజ్ సాయంతో జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్క్‌ను అయితే ధాటించాడు కేఎల్ రాహుల్ . ఇక బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి సెషన్ లో గాయపడ్డ బవుమా 20వ ఓవర్ లో డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టలేదు. మరోవైపు భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణతో పాటు శార్దూల్, సిరాజ్, బుమ్రా సౌతాఫ్రికాని కూడా గజగజ వణికించాలని అనుకుంటున్నారు.