ఈ మ‌ధ్య కాలంలో సుమ‌కి షోలు ఎందుకు త‌గ్గుతున్నాయి.. సీక్రెట్ రివీల్ చేసిన రాజీవ్ క‌న‌కాల‌

ఈ మ‌ధ్య కాలంలో సుమ‌కి షోలు ఎందుకు త‌గ్గుతున్నాయి.. సీక్రెట్ రివీల్ చేసిన రాజీవ్ క‌న‌కాల‌

బుల్లితెర‌పై తిరుగులేని క్రేజ్ ఉన్న యాంక‌ర్స్‌లో సుమ ఒక‌రు. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు మూవీ ఈవెంట్లతో నిత్యం బిజీగా గడిపేస్తూ ఉంటుంది సుమ‌. ఇక ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్, రీల్స్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. యూట్యూబ్‌లో ఏకంగా సొంత ఛాన‌ల్ కూడా ఓపెన్ చేసింది. ఇందులో ఆమె చేసే ర‌చ్చ అంత ఇంత కాదు. సుమ కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది యాంక‌ర్స్ వ‌చ్చారు. కాని ఎవ‌రు కూడా సుమ‌కి పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. అయితే ఈ మధ్య సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించక పోవ‌డంతో చాలా మందిలో చాలా ర‌కాల సందేహాలు నెల‌కొన్నాయి.

ప్ర‌స్తుతం సుమ బుల్లితెర‌పై ‘సుమ అడ్డా’ తప్ప వేరేం ప్రోగ్రామ్స్‌లో కనిపించడం లేదు. అవకాశాలు తగ్గిపోయాయా? లేక కావాలనే తగ్గించుకున్నారా? అనే సందేహం జ‌నాల‌లో చాలా ఉండ‌గా, దానిపై రాజీవ్ ఓ ఇంట‌ర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. కావాల‌నే సుమ ప్రోగ్రామ్స్ త‌గ్గించుకుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌న సొంత ఛానెల్ ‘సుమ’ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో ఆమె బిజీగా ఉన్న‌ట్టు రాజీవ్ క‌న‌కాల తెలియ‌జేశారు. పిల్ల‌ల‌తో స‌మ‌యం ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌ని కూడా సుమ భావించిన నేప‌థ్యంలో ఈ మ‌ధ్య షోస్ త‌గ్గించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. సుమ వర్క్ విష‌యంలో చాలా నిక్చ‌చ్చిగా ఉంటుంది. సుమ తండ్రి చనిపోయి బాధలో ఉన్న స‌మ‌యంలో కూడా తాము ప్రొడ్యూస్ చేసిన ల‌క్కు కిక్కు షో చేశామ‌ని గుర్తు చేసుకున్నారు రాజీవ్ క‌న‌కాల‌

ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తిన కూడా త‌ప్ప‌క వెళ్లి షోలు చేయాల్సిందే. ఆర్టిస్టుల జీవితాలు ఈ విధ్యంగానే ఉంటాయ‌ని రాజీవ్ క‌న్నా తెలియ‌జేశారు. మొత్తానికి సుమ గ‌త కొద్ది రోజులుగా బయట ప్రోగ్రామ్స్ కాస్త తగ్గించుకుని సొంత ఛానెల్ కోసం ఎక్కువ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని రాజీవ్ చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇక ఇదిలా ఉంటే రాజీవ్- సుమ త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల ఇటీవ‌ల బ‌బుల్ గ‌మ్ చిత్రంతో వెండితెర‌పై హీరోగా క‌నిపించి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.