కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి మ‌హేష్ సోద‌రుడి కూతురి డ్యాన్స్‌.. ఇర‌గ‌దీసిందిగా..!

కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి మ‌హేష్ సోద‌రుడి కూతురి డ్యాన్స్‌.. ఇర‌గ‌దీసిందిగా..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గుంటూరు కారం సినిమా అంత పెద్ద విజ‌యం సాధించ‌క‌పోయిన ఇందులోని కుర్చీ మ‌డ‌త పెట్టి అనే సాంగ్‌కి మాత్రం ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చింది.సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుద‌ల చేయ‌గా, చాలా మంది పాట‌కి రీల్స్ చేశారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం పాట‌కి కాలు క‌దిపారు. దీంతో చిత్రం రిలీజ్ కాక‌ముందే కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్ సంచ‌ల‌నం సృష్టించింది. ఇక రిలీజ్ అయిన త‌ర్వాత ఈ పాట‌కి మ‌రింత క్రేజ్ పెరిగింద‌ని చెప్పాలి.

గుంటూరు కారం మూవీ లోని కుర్చీని మడత పెట్టి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో సాధించ‌డం విశేషం.యూట్యూబ్‌లో ఈ సాంగ్ రేర్ మార్క్ వ్యూస్ ట‌చ్ చేయ‌డంతో చిత్ర బృందం చాలా సంతోషం వ్య‌క్తం చేసింది. థమన్‌ కొట్టిన బీట్స్‌కు, ఆ పాట లిరిక్స్‌ అద్భుతంగా సెట్ కావ‌డంతో ఈ మాస్‌ సాంగ్ జనాల్ని ఉర్రూతలూగిస్తుంది. అయితే ఈ పాట‌కి మ‌హేష్ బాబు సోదరుడు దివంగత నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని రెచ్చిపోయి డ్యాన్స్ చేసి ర‌చ్చ చేసింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ కి తన స్టైల్ లో డ్యాన్స్ అదరగొట్టిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో భార‌తి పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. వీడియోని చూసిన ప్ర‌తి ఒక్క‌రు అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌హేష్ కూతురు సితార కూడా ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయింది. అయితే భార‌తి తండ్రి, మ‌హేష్ సోద‌రుడు ర‌మేష్ బాబు 56 ఏళ్ల వ‌య‌స్సులో కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతూ జనవరి 8,2022న కన్ను మూసారు. మహేష్ బాబు కరోనా కారణంగా బాధపడుతూ ఉండడంతో తన సోదరుడిని ఆఖరి సారిగా కూడా చూడలేక పోయినందుకు చాలా ఎమోషన్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్ద కుమారుడు కాగా, ఆ త‌ర్వాత మణుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియా దర్శిని ఉన్నారు. ర‌మేష్ బాబుకి భార్య ఇద్దరు పిల్ల‌లు ఉన్నారు. రమేష్ బాబు వైఫ్ పేరు మృదుల కాగా కొడుకు పేరు జ‌య‌కృష్ణ‌. కూతురు పేరు భార‌తి. రానున్న రోజుల‌లో ర‌మేష్ బాబు కొడుకు సినీ ప‌రిశ్ర‌మ‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.