Arina Sabalenka | టెన్నిస్‌ స్టార్‌ అరీనా సబలెంక బాయ్‌ఫ్రెండ్‌ కోల్తోవ్స్‌ మృతి.. సంచలన విషయం బయటపెట్టిన పోలీసులు..!

Arina Sabalenka | టెన్నిస్‌ స్టార్‌ అరీనా సబలెంక బాయ్‌ఫ్రెండ్‌ కోల్తోవ్స్‌ మృతి.. సంచలన విషయం బయటపెట్టిన పోలీసులు..!

Arina Sabalenka | ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ అరీనా సబలెంక్‌ బ్రాయ్‌ఫ్రెండ్‌ కోన్‌స్టాంటిన్‌ కొల్తోవ్స్‌ మృతి చెందారు. కోల్తోవ్స్‌ మాజీ ఎన్‌హెచ్‌ఎల్‌ ఐస్‌ హాకీ ప్లేయర్‌. కోల్తోవ్స్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు మియామీ పోలీసులు మంగళవారం తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.39 గంటలకు సెయింట్‌ రెగిస్‌ బాల్‌ హార్బర్‌ రిస్టార్ట్‌లో బాల్కనీ నుంచి ఓ వ్యక్తి దూకినట్లుగా పోలీసులకు సమాచారం అందిందని పోలీస్‌ ప్రతినిధి అర్జెమిస్‌ కోలోమ్‌ పేర్కొన్నారు. మియామి పోలీస్ డిపార్ట్‌మెంట్, హోమిసైడ్ బ్యూరో వెంటనే అక్కడికి చేరుకుని ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారని, ఇందులో కుట్రకు అవకాశం లేదని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ బెలారస్‌కు చెందిన సబలెంకా ఈ వారాంతంలో మియామీ ఓపెన్‌లో పాల్గొననున్నది. 2023లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి.. ఈ ఏడాది ప్రారంభంలో మెల్‌బోర్న్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న సబలెంక.. బాయ్‌ఫ్రెండ్‌ మరణంతో టోర్నీలో కొనసాగుతుందా? వైదొలుగుతుందా? స్పష్టంగా తెలియరాలేదు. కోల్తోవ్స్‌ బెలారస్‌ జట్టు మాజీ ఐస్‌ ఆటగాడు. సుమారు 18 సంవత్సరాల పాటు కెరీర్‌ను కొనసాగించాడు. నేషనల్ హాకీ లీగ్‌లో పిట్స్‌బర్గ్ పెంగ్విన్స్ తరఫున మూడు సీజన్స్‌లో పాల్గొన్నాడు. 2022-2006 వరకు జట్టులో కీలక సభ్యడు. 2002-2010 వింటర్ ఒలింపిక్స్‌లో బెలారస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కోల్తోవ్స్‌ మరణాన్ని బెలారస్‌ హాకీ ఫెడరేషన్‌ ధ్రువీకరించింది. ఫెడరేషన్ తన వెబ్‌సైట్‌లో సంతాపం ప్రకటించింది. కోల్తోవ్స్‌కు ఇప్పటికే భార్య భార్య జూలియా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2020లో భార్యకు విడాకులు ఇచ్చాడు.

ఆ తర్వాత సబలెంకతో ప్రేమలోపడ్డాడు. 2016లో క్రీడా జీవితానికి ముగింపు పలికిన కోల్తోవ్స్‌.. ఆ తర్వాత పలు జట్లకు కోచ్‌గా పని చేశాడు. కొంటినెంటల్ హాకీ లీగ్‌లో సలావత్ యులేవ్ ఉఫా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. అయితే, కోల్తోవ్స్‌, సంబలెంక మధ్య ప్రేమ ఎక్కడ మొదలైందో తెలియదు కానీ.. ఇద్దరూ 2021 నుంచి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. 2021 జూన్‌లో ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఎక్కడికి వెళ్లినా ఫొటోలను పంచుకునేవారు. సబలెంక-కోల్తోవ్స్‌ మధ్య 17 సంవత్సరాల ఏజ్‌ గ్యాప్‌ ఉన్నది. అయితే, బాయ్‌ఫ్రెండ్‌ మరణంపై ఇప్పటి వరకు సబలెంక స్పందించలేదు. ఆమెకు పలువురు అభిమానులు అండగా నిలుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.