తమిళ నటుడు విశాల్ జాతీయ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డులు అర్థరహితమని, ఒకవేళ తనకు వచ్చినా వాటిని డస్ట్‌బిన్‌లో వేస్తానని స్పష్టం చేశారు.

Vishal Calls National Awards Bullshit | Tamil Actor Says He’ll Throw Awards in Dustbin
జాతీయ పురస్కారాల ప్రాముఖ్యతపై చర్చలు జరుగుతున్న తరుణంలో, తమిళ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల తన స్వంత పాడ్‌కాస్ట్ Yours Frankly Vishalలో మాట్లాడిన ఆయన, అవార్డుల విలువ, న్యాయసంబంధతపై గట్టి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
నాకు అవార్డుల పట్ల నమ్మకం లేదు
“నేను అవార్డుల మీద నమ్మకం పెట్టుకోను. అవార్డులు అనేవి బుల్‌షిట్. ఎనిమిది మంది కూర్చుని ఎనిమిది కోట్ల మంది అభిమానించే నటుడు, సినిమాను నిర్ణయించడం ఎలా సాధ్యం? ఇది జాతీయ అవార్డులకు కూడా వర్తిస్తుంది. నేను అవార్డు పొందలేదనే కోపం కాదు — అవార్డుల అనే వ్యవస్థ పట్లే నమ్మకం లేదు,” అని అన్నారు. “ఎవరు నాకు అవార్డు ఇచ్చినా, దాన్ని నేను డస్ట్‌బిన్‌లో వేస్తా. బంగారంతో చేసిన అవార్డు అయితే అమ్మేసి ఆ డబ్బును దానం చేస్తా,” అని స్పష్టంగా చెప్పారు.
విశాల్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఈ వ్యాఖ్యలను జాతీయ గౌరవానికి అవమానంగా విమర్శిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా విశాల్ “నిజమైన అవార్డు ప్రేక్షకుల ప్రేమే. వాళ్ల మద్దతుతోనే నేను ఇంతకాలం ఈ ఇండస్ట్రీలో ఉన్నా,” అంటూ చెప్పిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం విశాల్ తన కొత్త చిత్రం ‘మగుడం’ (Magudam) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మొదట ఈ సినిమాను దర్శకుడు రవి అరసు తెరకెక్కించగా, సృజనాత్మక విభేదాల కారణంగా విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 35వ సినిమాగా నిలుస్తుంది. హీరోయిన్‌గా దుషారా విజయన్, కీలక పాత్రలో అంజలి నటిస్తున్నారు.
అలాగే, వ్యక్తిగతంగా ఆయన ఇటీవల నటి సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నారు.