SaiChand | గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి
SaiChand | నాగర్ కర్నూల్ జిల్లా: ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లిన సాయిచంద్ అక్కడే అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు సాయిచంద్‌ని, నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా గుండెపోటుతో పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. సాయి చంద్ వెంట భార్య […]

SaiChand |
నాగర్ కర్నూల్ జిల్లా: ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వెళ్లిన సాయిచంద్ అక్కడే అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యారు.
గమనించిన కుటుంబసభ్యులు సాయిచంద్‌ని, నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా గుండెపోటుతో పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
సాయి చంద్ వెంట భార్య రజని, పిల్లలు పీఏ గన్‌మెన్ ఉన్నారు.సాయిచంద్‌మృతిపై సీఎం కేసీఆర్, మంత్రులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
సాయిచంద్ మరణం కలచివేసింది: సీఎం కేసీఆర్
సాయి చంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు.
సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్నారన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు