Grammy Awards 2026 | గ్రామీ అవార్డ్స్ 2026 రెడ్ కార్పెట్‌పై బోల్డ్ ఫ్యాషన్ హంగామా.. ఆమె టాప్ లెస్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్
Grammy Awards 2026 | ప్రపంచ సంగీత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు ఈసారి కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. సంగీత ప్రతిభకు గౌరవం తెలిపే ఈ వేదికపై కళాకారులు తమ గానంతో మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.
Grammy Awards 2026 | ప్రపంచ సంగీత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు ఈసారి కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. సంగీత ప్రతిభకు గౌరవం తెలిపే ఈ వేదికపై కళాకారులు తమ గానంతో మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ప్రత్యేక చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అమెరికన్ సింగర్ చాపెల్ రోన్ ధరించిన డ్రెస్ ఈ వేడుకల హైలైట్‌గా నిలిచింది.
గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై చాపెల్ రోన్ బోల్డ్ అండ్ యూనిక్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమె దాదాపు టాప్‌లెస్‌గా కనిపించేలా ఉన్న ట్రాన్స్పరెంట్ షీర్ డ్రెస్ ధరించి, దానికి బాడీ ఆర్ట్‌ను జోడించి ధైర్యవంతమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ డ్రెస్‌తో ఆమె చేసిన వాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఇదొక కొత్త ట్రెండ్‌గా నిలుస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చాపెల్ రోన్ ధరించిన ఈ డ్రెస్ గ్రామీ అవార్డ్స్ చరిత్రలోనే అత్యంత బోల్డ్ లుక్స్‌లో ఒకటిగా నిలిచిందని ఫ్యాషన్ విమర్శకులు చెబుతున్నారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వినూత్న దుస్తులతో మెప్పించినా, ఈసారి షీర్ ఫ్యాబ్రిక్ మరియు బాడీ ఆర్ట్ కలయిక మాత్రం కొత్తదనాన్ని చూపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు ఒకవైపు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఈ లుక్‌పై విమర్శలు కూడా చేస్తున్నారు.
ఈ వేడుకల్లో చాపెల్ రోన్‌తో పాటు మరికొంత మంది ప్రముఖ గాయకులు కూడా తమ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. లేడీ గాగా “కేజ్‌డ్ బర్డ్” కాన్సెప్ట్ డ్రెస్‌లో ప్రత్యేకంగా కనిపించి రెడ్ కార్పెట్‌పై మెరిశారు. సబ్రినా కార్పెంటర్, రోజ్, బిల్లీ ఐలిష్ తమ తమ ఫ్యాషన్ ఎంపికలతో అభిమానులను అలరించారు. బిల్లీ ఐలిష్ ఈసారి నలుపు-తెలుపు కాంబినేషన్‌లో రూపొందించిన సింపుల్ కానీ ఎలిగెంట్ డ్రెస్‌లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఆమె ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుని మరోసారి తన ప్రతిభను నిరూపించారు.
మరోవైపు మైలీ సైరస్ రాక్ అండ్ రోల్ స్టైల్‌లో నలుపు లెదర్ జాకెట్‌తో ప్రత్యేకమైన లుక్‌లో కనిపించారు. గతంలో ‘ఫ్లవర్స్’ పాటతో గ్రామీ అవార్డును అందుకున్న ఆమె ఈసారి ఫ్యాషన్‌తోనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మొత్తం మీద గ్రామీ అవార్డ్స్ 2026 వేడుకలు సంగీత పరంగానే కాకుండా ఫ్యాషన్ రంగంలోనూ భారీ చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా చాపెల్ రోన్ బోల్డ్ లుక్ ఈసారి గ్రామీ రెడ్ కార్పెట్‌లో హాట్ టాపిక్‌గా మారడం విశేషం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram