Viral Video : వండర్..చేతులు లేకపోయినా ఓకేసారి డోలు, డోలక్ తప్పెట్ల మోత

చేతులు లేకపోయినా ఒకేసారి డోలు, ఢోలక్, తప్పేట, వేణు వాయిస్తూ అద్భుత ప్రదర్శన ఇచ్చిన దివ్యాంగ యువకుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాడు.

Viral Video : వండర్..చేతులు లేకపోయినా ఓకేసారి డోలు, డోలక్ తప్పెట్ల మోత

విధాత : సంకల్పం ఉంటే మనిషి.. తనలోని వైకల్యాలను, లోపాలను అధిగమించి విధిని దాసోహం చేసుకుని విజయాలను అందుకుంటాడనేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. దివ్యాంగుడైన ఓ యువకుడు జీవనోపాధికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాడు. తనకు రెండు చేతులు లేకపోయినా..తన ధృడమైన సంకల్పంతో కూడిన సాధనతో ఒకేసారి డోలు, ఢోలక్ డ్రమ్స్, తప్పేట వాయిద్యాలను వాయించడంతో పాటు మధ్యలో వేణుగానాన్ని సైతం వినిపించి అనితర సాధకుడిగా నిలిచాడు. జనం మధ్య ఓకేసారి నాలుగు సంగీత వాయిద్యాలను వాయించి అందరిని అబ్బురపరుస్తున్నాడు. తన అంగవైకల్యంతో కూడిన తన రెండు చేతులతో పాటు కాళ్లను ఉపయోగించి అతడు ఈ అద్బుత విద్యను ప్రదర్శించడం విశేషం.

తన అద్బుత ప్రదర్శనతో ఓ బిక్షగాడిగా కాకుండా తన కళా నైపుణ్యానికి సగర్వంగా జనంతో నగదు నజరానాలు అందుకుంటూ ఆత్మగౌరవాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటజన్లు ఆ దివ్యాంగుడు పట్టుదల, సంకల్పం ఉంటే మనిషి అద్బుతాలు సృష్టించడమే కాదు..వైకల్యాన్ని అధిగమించి జీవనోపాధితో పాటు జీవితాశయాలను సాకారం చేసుకోవచ్చని చాటాడంటూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Crocodile Attack : మొసలి షాకింగ్ ఎటాక్..తప్పిన చావు
Pawan Kalyan | కొండ‌గ‌ట్టు నాకు పున‌ర్జ‌న్మ‌ని ఇచ్చింది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్