Viral Video | మ్యూజిక్‌ ఆస్వాదించిన ఖడ్గమృగం.. వీడియో వైరల్!

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అనే నానుడి ఉంది. మంచి సంగీతం వింటే ఎక్కడాలేని ఉత్సాహం, ఆనందం కలుగుతుంది.

Viral Video | మ్యూజిక్‌ ఆస్వాదించిన ఖడ్గమృగం.. వీడియో వైరల్!

సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అనే నానుడి ఉంది. మంచి సంగీతం వింటే ఎక్కడాలేని ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. మనుషులే కాదు.. జంతువులు కూడా సంగీతానికి పరవశంతో తన్మయం పొందుతాయి. ఇలాంటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఒక అభయారణ్యంలో ఒక వ్యక్తి గిటార్ వాయిస్తూ కూర్చుంటాడు. ఈ క్రమంలో అక్కడే కొద్ది దూరంలో ఉన్న ఖడ్గమృగం స్పందించింది. సంగీతం విని.. గిటార్ వాయిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ మ్యూజిక్ ను ఆస్వాదించడంతో పాటు తల అటుఇటూ ఊపుతూ ఎంజాయ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.