ఊహించని ఎలిమినేష‌న్.. తెగ ఏడ్చేసిన శోభా శెట్టి

ఊహించని ఎలిమినేష‌న్..  తెగ ఏడ్చేసిన శోభా శెట్టి

బిగ్ బాస్ సీజ‌న్ 7లో ఎలిమినేష‌న్స్ ఊహించ‌ని విధంగా జ‌రుగుతున్నాయి. ఏ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో, ఎప్పుడు ఎవ‌రు హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారో అనేది పెద్ద స‌స్పెన్స్‌గానే మారింది.ఆదివారం ఎపిసోడ్‌లో ఎప్ప‌టి మాదిరిగానే నాగార్జున హౌజ్‌మేట్స్‌తో ఫ‌న్నీ టాస్క్‌లు ఆడించాడు. ప్రతి కంటెస్టెంట్ తను చెప్పిన ఇద్దరు హౌస్ మేట్స్ లో తమ బోటులో ఎవరిని ఉంచుకుంటారో? ఎవరిని ముంచేస్తారో చెప్పాలని అన్నాడు. ముందుగా గౌత‌మ్ నుండి గేమ్ మొద‌లు కాగా, ప్రియాంక‌ని బోటులో ఉంచి అర్జున్‌ని తోసేస్తాన‌ని చెప్పాడు. ఇక అర్జున్.. అమ‌ర్‌దీప్‌ని ముంచి గౌత‌మ్‌ని ఉంచుకున్నాడు. ఇక అమ‌ర్ బోట్‌లో ప్రియాంక -శోభా ఉండ‌గా, ప్రియాంకని ముంచేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు.

ఇక‌ యావర్ తన బోటులోంచి రతికను తోసేసి శివాజీని ఉంచుకున్నాడు. ఇక భోలే – అశ్వినిని, తేజ – శోభా శెట్టిని, శివాజీ ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ యావర్ ను బోట్ నుంచి కింద‌కు ప‌డేసారు. ప్రియాంక – అమర్ దీప్ ను, ఆట సందీప్ – శివాజీని ముంచేయ‌గా, రతిక – యావర్ ను, శోభాశెట్టి – సందీప్ ను ముంచేస్తామ‌ని చెప్పుకొచ్చారు. అయితే నామినేష‌న్‌లో శివాజీ, శోభా శెట్టి, అమర్ దీప్, ఆట సందీప్, అశ్విని, భోలే షావలి ఉండ‌గా, వారంద‌రికి బాక్సుల‌ని అందించారు అందులో గోల్డ్ మెడల్ ఉంటే సేఫ్? లేదంటే నాట్ సేఫ్ అని తెలియ‌జేశారు నాగ్. ఇందులో అశ్విని గోల్డ్ మెడల్ ద‌క్కించుకొని సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఆ త‌ర్వాత ర్యూబిక్ గేమ్ లో అమర్ దీప్ సేఫ్ అయ్యారు.

ఇక అనంతరం ‘డైలాగ్ కొట్టు గురూ’ అనే ఫన్నీ గేమ్ ఆడించ‌గా, ఈ గేమ్ ప్ర‌కారం ఒకరు హెడ్ ఫోన్ పెట్టుకొని లౌడ్ మ్యూజిక్ వింటూ ఉంటే వారికి అర్ధ‌మ‌య్యేలా డైలాగ్ చెబుతారు. అప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకున్న హౌస్ మేట్ ఆ డైలాగ్ లిప్ సింక్ ఆధారంగా కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్ స‌ర‌దాగా ఆగింది. ఆ త‌ర్వాత శివాజి సేఫ్ అయిన‌ట్టు నాగ్ తెలిపారు. ఇక నామినేషన్ లో ఉన్న వారిలో భోలే గ్రీన్ ఫ్లగ్ తో నామినేషన్ నుంచి బయటపడ్డారు. చివ‌రిగా సందీప్,శోభా శెట్టి యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ల‌గా, అప్పుడు ఆట సందీప్ ఎలిమినేట్ అయినట్టు ప్ర‌క‌టించారు.. దాంతో శోభా శెట్టి చాలా ఎమోష‌న‌ల్ అయింది. తానే ఎలిమినేట్ అవుతాన‌ని అనుకున్నానంటూ టేస్టీ తేజా గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చింది శోభా. ఇక సందీప్ హౌజ్ ను వీడిపోతూ తన మ్యూచువల్ ఫండ్ బాక్సు ను అమర్ దీప్ కు అందించి వెళ్లారు. మొత్తానికి సందీప్ ఎలిమినేష‌న్ మాత్రం ఆసక్తిక‌రంగా మారింది.