శివాజికి వెన్నుపోటు పొడిచిన యావ‌ర్‌..ఆయ‌న కూతురితో పీక‌ల్లోతు రొమాన్స్

  • By: sn    breaking    Jan 27, 2024 10:59 AM IST
శివాజికి వెన్నుపోటు పొడిచిన యావ‌ర్‌..ఆయ‌న కూతురితో పీక‌ల్లోతు రొమాన్స్

ఒక‌ప్పుడు హీరోగా వైవిధ్య‌మైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన హీరో శివాజి. అయితే గ‌త కొంత కాలంగా ఆయన సినిమాల‌కి దూరంగా ఉంటూ సైలెంట్ అయ్యారు. ఇక ఎవ‌రు ఊహించని విధంగా శివాజి సీజ‌న్ 7లో బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి అంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై పడేలా చేశారు. హౌజ్‌లో శివాజీ టీంగా యావ‌ర్, ప్ర‌శాంత్ ఉండ‌గా ఈ ముగ్గురు స్పై బ్యాచ్‌గా కూడా పాపులారిటీ తెచ్చుకున్నారు. యావ‌ర్‌, ప్ర‌శాంత్‌ని త‌న త‌మ్ముళ్లు మాదిరిగా భావించిన శివాజి హౌజ్‌లో వారిని ఎంతో ప్రోత్స‌హిస్తూ క‌నిపించాడు. భాష రాని యావర్, పల్లెటూరికి చెందిన ప్రశాంత్ లకు శివాజీ అండగా ఉంటూ వాళ్ళ విజయంలో శివాజి కీల‌క‌మ‌య్యాడ‌ని అంద‌రికి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు శివాజిని ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌, యావ‌ర్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ముఖ్యంగా శివాజి చేతికి గాయ‌మైన‌ప్పుడు ఇద్ద‌రు కూడా చాలా స‌ప‌ర్య‌లు చేశారు. ఈ ముగ్గురు కూడా టాప్ 5కి చేరుకోగా యావ‌ర్ రూ. 15 లక్షలు తీసుకుని నాలుగో స్థానంలో నిలిచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇక శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ట్రోఫీ అందుకున్నాడు. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఈ ముగ్గురు క‌లిసి తెగ సంద‌డి చేస్తున్నారు. స్టార్ మా ఈవెంట్‌లో సైతం వారు ముగ్గురు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే యావ‌ర్‌ని త‌న త‌మ్ముడిగా భావించిన శివాజికి మ‌నోడు వెన్నుపోటు పొడిచాడంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది.

విష‌యం ఏంటంటే.. బిగ్ బాస్ హౌజ్‌లో ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా న‌య‌ని పావ‌ని వ‌చ్చిన విష‌యం తెలిసిందే. హౌజ్‌లో ఉంది ఒక్క వార‌మే అయిన శివాజితో ఆమెకి మంచి బాండింగ్ ఏర్ప‌డింది. న‌య‌న‌నిని శివాజి త‌న కూతురిలా భావించి బిడ్డా అని ఎంతో ప్రేమ‌గా పిలిచేవాడు. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా న‌య‌నితో అలాంటి రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నయని పావనితో ఇప్పుడు యావర్ రొమాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. యావర్-నయని పావని ‘తెలియదే’ అనే ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఇది యూట్యూబ్ లో విడుదలైంది. ఇందులో ఇద్ద‌రి రొమాన్స్ చూసి ఓ నెటిజ‌న్.. రేయ్ తమ్ముడు అనుకుంటే ఆయ‌న‌కు అల్లుడు అయ్యేటట్టు ఉన్నావు అని కామెంట్ చేశారు. శివాజీని నయని పావని తండ్రిగా భావిస్తున్న నేపథ్యంలో ఇప్ప‌డు ఆమెతో యావ‌ర్ సన్నిహితంగా ఉంటున్న కార‌ణంగా యావ‌ర్‌ని శివాజీ అల్లుడిగా పోలుస్తున్నారు.