ఇంట్రెస్టింగ్‌గా మారిన ఫినాలే రేస్..అర్జున్ ప్రవర్తనకి విసిగిపోయిన శివాజి

బిగ్ బాస్ సీజన్7 చివరి దకు వచ్చింది. టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ఎవరు ఉంటారా అనే చర్చ ఇప్పుడు అంతటా నడుస్తుంది. మరోవైపు టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ కాగా, ఇది సంపాదించుకొని తొలి ఫైనలిస్ట్‌గా వెళ్లాలని 8 మంది కంటెస్టెంట్స్ చాలా కష్టపడుతున్నారు. అయితే అర్జున్ కొట్టిన దెబ్బకి ఇంకా శివాజి కోలుకున్నట్టుగా కనిపించడం లేదు. తాజా ఎపిసోడ్‌లో ప్రశాంత్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ.. ‘నేను వెళ్లిపోవాల్సిందిరా.. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను.. వాడెవడ్రా (గౌతమ్) అసలు.. వాడితో నాకేం సంబంధంరా.. వాడు కావాలనే ప్రతివారం గొడవ పడుతున్నాడు.. దాని వల్ల వాడికేం ప్రయోజనం ఉందో దేవుడికే తెలియాలి.. మరీ ఇంత కమర్షియల్‌గా ఉంటార్రా మరీ అన్యాయంగా.. వాడు చెప్పేవన్నీ అబద్దాలే. వాడ్ని నేను ఆపుతున్నానని అంటున్నాడు. నేనేం ఆపుతున్నారా?? నేను ఆపితే 12 వారాలు ఉంటాడా??
ఇక ఈ అర్జున్ అతి తెలివితేటలు ఏంటో నాకు అర్ధం కావడం లేదు. ప్రేమగా దగ్గరగా ఉంటే పొడుస్తారు. ఆ అమర్ గాడు అయితే నేను దొంగాటలు ఆడానని అన్నాడు.. ఏంట్రా వీళ్లంతా’ అని శివాజీ తెగ ఫీలైపోయాడు.బాధపోయాడు. దీంతో ప్రశాంత్.. ‘అమర్ అన్న ఆటకి అడ్డం పడ్డ గౌతమ్‌ని ఏం అనలేదు కాని అమర్ అన్న నిలబడినందుకు చెడ్డోడ్ని అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక టికెట్ టూ ఫినాలే టాస్క్ కోసం తాజా ఎపిసోడ్‌లో రెండు టాస్క్ లు పెట్టాడు. ఈ టాస్క్ లలో గెలవాలి అనుకున్న శివాజీ, శోభ, ప్రియాంక ఆశలు గల్లంతయ్యాయి. టాప్ లో ఉన్న ఈ ముగ్గురు రెండుటాస్క్ లలో మొదటి రౌండ్ లోనే ఫెయిల్ అయ్యారు.
ఈ టాస్క్‌లో గెలిచిన అమర్‌కి ఓడిన శివాజీ, శోభ తమ పాయింట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక శోభ గేమ్ నుండి తప్పుకున్నందుకు చాలా ఏడ్చింది. ఇక టికెట్ టూ ఫినాలే టాస్క్ లో పాల్గొన్నవారందరు కూడా .. అమర్, ప్రియాంక మధ్య పోటీ జరుగుతుంది. ఈ గేమ్ లో ఇద్దరు బాల్ కోసం కొట్లాడుకుంటారు. ఒకానొక సమయంలో అమర్ చేయి కొరుకుతుంది ప్రియాంక. అయిన కూడా వినకుండా అమర్ తన టార్గెట్ పూర్తి చేస్తాడు. ఇక ఈ టాస్క్ లో అర్జున్ ఎక్కువ పాయింట్స్ సాధిస్తాడు. నేటి ఎపిసోడ్‌లో కూడా మరి కొన్ని టాస్క్‌లు బిగ్ బాస్ ఇవ్వనున్నాడు. ఇందులో ఎవరు గెలిచి టికెట్ టూ ఫినాలే దక్కించుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, అర్జున్, యావర్, గౌతమ్ ఉండగా, వీరిలో అమర్‌ని మించి అందరు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.