చిరుతో గొడవలు నిజమే..నా ఫుల్ సపోర్ట్ నాన్నగారికేనన్న రాజశేఖర్ కూతురు

ఒకప్పుడు యాంగ్రీయంగ్‌మెన్‌గా రాజశేఖర్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. చిరంజీవి సినిమాలకి పోటీగా కూడా ఆయన సినిమాలు నడిచేవి. పోలీస్ పాత్రలలో రాజశేఖర్ అత్యద్భుతంగా నటించి మెప్పించేవారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన అంతగా అలరించలేకపోతున్నారు. అయితే రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మికలు ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. శివాని రాజశేఖర్ విషయానికి వస్తే ఈ అమ్మడు హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపిస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది. స్టార్ బ్యూటీగా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. తాజాగా శివాని రాజశేఖర్ నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. నవంబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే శివాని మాట్లాడుతూ.. రాజశేఖర్ కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా ఉన్న విభేదాల గురించి క్లారిటీ ఇచ్చింది. లోపల బియ్యం గింజ అంత జరిగితే బయటకి బిర్యానీ అంత కనిపిస్తుంది అని శివాని పేర్కొంది. రాజకీయాలలో ఉన్నప్పుడు వాగ్వాదాలు చోటు చేసుకోవడం సహజం. పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరుగా ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కొంత డిస్ట్రబెన్స్ వచ్చినప్పటికి అది ఆ హీట్ మూమెంట్ లో మాత్రమే జరిగాయి. ఇంకా దాని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తారో, ట్రోలింగ్ చేస్తారో అర్ధం కావడం లేదని పేర్కొంది శివాని
ఆ గొడవల గురించి బయట వాళ్ళు ఎందుకు ఇంకా ఎక్కువగా గొడవ పడడం ? ట్రోలింగ్ ఎందుకు చేయడం ? అని శివాని ప్రశ్నించింది. ఎప్పుడో చిన్న చిన్న వివాదాలు జరిగినంత మాత్రాన వాళ్ళ ప్రొడక్షన్ లో నేను నటించకూడదు అని ఏమీ లేదు.. మా ప్రొడక్షన్ లో వాళ్ళు నటించకూడదు అని ఎలాంటి రూల్ లేదు. అందరం ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తాం అని తెలియజేసింది. అయితే ఎలాంటి వివాదాలు ఎవరితో జరిగిన నా ఫుల్ సపోర్ట్ నాన్నగారికే ఉంటుంది. కాగా, శివాని నటించిన కోట బొమ్మాళి పీఎస్ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన విషయం విదితమే.