Sasirekha Song Promo | సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’… అలరిస్తున్న ‘శశిరేఖ’ ప్రోమో సాంగ్
Sasirekha Song Promo |మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలోకి సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Sasirekha Song Promo |మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలోకి సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా క్యాథరిన్ నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ మరియు ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘మీసాల పిల్ల’ పాట 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియా, మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో భారీగా ట్రెండ్ అవుతోంది.
అభిమానుల్లో ఈ విజయోత్సాహం కొనసాగుతుండగా, ఇప్పుడు మూవీ టీమ్ సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి రెడీ అయింది.‘శశిరేఖ’ అనే రెండో సింగిల్‌ను డిసెంబర్ 8న లిరికల్ వీడియో రూపంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా కొద్ది సేపటి క్రితం సాంగ్ ప్రోమో విడుదల చేశారు. నయనతార పాత్ర పేరు మీదుగా వస్తున్న ఈ పాటకు భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించగా, అనంత్ శ్రీరామ్ హృద్యమైన సాహిత్యం రాశారు. భీమ్స్–మధుప్రియ వాయిస్ ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 8న ఫుల్ సాంగ్ రానుండగా, దాని కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది కూల్ అండ్ మెలోడియస్ డ్యాన్స్ నంబర్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అనంత్ శ్రీరామ్ అందమైన సాహిత్యంతో పాటు భాను మాస్టర్ కొరియోగ్రఫీ విజువల్స్‌కు అందాన్ని తీసుకురానున్నాయి. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ మరింత ఆకర్షణీయంగా మారడంతో సంక్రాంతి రిలీజ్‌కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ రెడీగా నిలిచింది. ఇందులో చిరు లుక్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన ప్రోమో సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram