ఒక‌ప్పుడు స్లిమ్‌గా ఉన్న న‌మిత అంత బ‌రువు పెర‌గ‌డానికి ఆ వ్యాధి కార‌ణ‌మా?

  • Publish Date - November 18, 2023 / 12:00 PM IST

కోలీవుడ్ ముద్దుగుమ్మ న‌మిత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు తెలుగు సినిమాల‌లో కూడా న‌టించి అల‌రించింది. సొంతం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ ముద్దుగుమ్మ అనంతరం జెమిని, బిల్లా వంటి పలు సినిమాలలో నటించి అల‌రించింది. న‌మితకి త‌మిళంలో వీరాభిమానులు ఉన్నారు. ఆమె కోసం ఏకంగా గుడి కూడా క‌ట్టేశారు అంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే న‌మిత ఉన్న‌ట్టుండి అధిక శరీర బరువు పెరిగిపోయారు.ఇలా అధిక శరీర బ‌రువు పెర‌గ‌డం కారణంగా తెలుగులో ఈమెకు హీరోల పక్కన హీరోయిన్గా అవకాశాలు కాకుండా సినిమాలలో ఏదో చిన్న చిన్న పాత్రల్లో న‌టించే అవకాశం ద‌క్కింది.

హీరోయిన్‌గా పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోతుండ‌డంతో ఈ అమ్మ‌డు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నమిత తమిళంలో మాత్రం అల‌రిస్తూనే ఉంది. సాధార‌ణంగా హీరోయిన్స్ త‌మ బాడీపై పూర్తి ఫోక‌స్ పెట్టి స్లిమ్‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఫిట్నెస్ విషయంపై ఎంతో కేర్ తీసుకుంటారు. అయితే న‌మిత కూడా త‌న ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా అధిక శరీర బరువు పెరిగిపోతూ వచ్చారు.తద్వారా ఈమెకు సినిమా అవకాశాలు కూడా దూరం అయ్యాయి.

అయితే న‌మిత అంత భారీ బరువు పెరగ‌డానికి కార‌ణం డిప్రెషన్, థైరాయిడ్ అట‌. ఈ సమస్యల కారణంగానే ప్రతిరోజు మందులు వాడటం వల్ల ఈమె అధిక శరీర బరువు పెరిగిపోయారని స‌మాచారం. ఈ అమ్మ‌డు 2017 వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని తిరుపతిలో ఘనంగా వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గత ఏడాది కవల మగ పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా న‌మిత భ‌ర్త చిక్కుల్లో ప‌డ్డాడు. తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామంటూ గోపాల్‌స్వామి అనే వ్యక్తిని రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో న‌మిత భ‌ర్త‌కి నోటీసులు నోటీసులు జారీ అయ్యాయి.

Latest News